Lungs : ప్రస్తుతం మనం నివసిస్తున్న కాలుష్యపు వాతావరణం వల్ల మన ఊపిరితిత్తులపై అధికంగా ప్రభావం పడుతోంది. అలాగే మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా కూడా ఊపిరితిత్తులు అనారోగ్యాలకు గురవుతున్నాయి. కాలుష్యపు గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ఆ గాలిలో ఉండే విష పదార్థాలు వెళ్తున్నాయి. దీంతోపాటు హానికర వాయువులు కూడా వెళ్తున్నాయి. ఇవి ఊపిరితిత్తులను అనారోగ్యం పాలు చేస్తున్నాయి. దీని వల్ల ఊపిరితిత్తులు దీర్ఘకాలంలో చెడిపోవడం లేదా క్యాన్సర్ బారిన పడడం జరుగుతోంది. ఇది ప్రాణాల మీదకు తెస్తోంది. అయితే కాలుష్యపు వాతావరణంలో నివసించే వారు మాత్రమే కాదు.. ఇతరులు ఎవరైనా సరే ఊపిరితిత్తుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లేదంటే అవి అనారోగ్యానికి గురవుతాయి. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కింద చెప్పిన విధంగా ఒక డ్రింక్‌ను తయారు చేసి రోజుకు ఒక కప్పు మోతాదులో తాగాలి. దీని వల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. వ్యర్థాలు బయటకుపోతాయి. ఇక ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలంటే..
రెండు కప్పుల నీళ్లు తీసుకుని ఒక పాత్రలో పోసి మరిగించాలి. అందులో చిన్న అల్లం ముక్క వేయాలి. సన్నని మంటపై నీళ్లు ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి. అనంతరం నీటిని దింపి వడకట్టాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం కలపాలి. ఈ నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు ఒకసారి ఈ డ్రింక్‌ను తాగాలి. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

రోజూ చాలా మంది బయట తిరుగుతుంటారు. కొందరు కాలుష్యపు వాతావరణంలో నివసిస్తుంటారు. వీరే కాదు.. అందరూ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను పైన తెలిపిన డ్రింక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని రోజూ తాగడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ఇలా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.