సహజంగా తలనొప్పి వచ్చినప్పుడు తల వెనుక భాగంలో కూడా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ నొప్పి తల వెనుక భాగంలో ఎక్కువ గా వచ్చినప్పుడు తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ నొప్పి ఎక్కువైతే నిద్ర కూడా పట్టదు.
ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అయినప్పుడు కండరాలు టైట్ గా మారతాయి. దాంతో మెడ మరియు భుజాలు భాగంలో నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ విధంగా తలనొప్పి వస్తుంది కాబట్టి యోగ, మెడిటేషన్ వంటివి చేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరైన పొజిషన్ లో పడుకోకపోవడం వలన కూడా కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి. దాంతో తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మైగ్రేన్ వలన కూడా ఈ తలనొప్పి వస్తుంది. వయస్సు పెరగడం వలన లేక సర్వైకల్ స్పాండిలైటిస్ కారణంగా కూడా తల వెనుక భాగంలో మరియు మెడ భాగాలలో నొప్పి వస్తూ ఉంటుంది. కండరాలు బలహీనంగా మారడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి తరచుగా ఎక్సర్సైజులు చేయాలి. హై బీపి కారణంగా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీవన శైలి మార్చుకొని బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి.