మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు.
మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే…కొన్ని చిట్కాలు చూడండి. ఈ పిరీయడ్స్ పరిస్ధితిని అదుపులో వుంచేవి బెర్రీలు, కాల్షియం, విటమిన్ ఇ, బి 6 , మెగ్నీషియం. కాగా డార్క్ చాక్లెట్ కూడా అద్భుతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. డార్క్ చాక్లెట్ లో వుండే మెగ్నీషియం, ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు వీరి సమస్యకు నివారణ నిచ్చి మరోమారు హాయిగా వుండేలా చేయగలవంటున్నారు.
ఈ సమయంలో షుగర్, ఉప్పు, కేఫైన్ వుండే పదార్ధాలు తినకండి. ఇవి కడుపు ఉబ్బరించి, కోపాన్ని, ఆందోళనను, మనోవేదనను కలిగిస్తాయి. ఈ సమయంలో కొద్దిపాటి వ్యాయామం కూడా తప్పని సరి. మీ మూడ్ మారి శక్తిపొందటానికిగాను కనీసం రోజూ 30 నిమిషాలపాటు నడక ప్రయత్నించండి.