Sugar : మనలో చాలా మంది పంచదారతో చేసిన తీపి వంటకాలను ఇష్టంగా తింటూ ఉంటారు. పంచదారతో చేసే ఈ తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. అయితే పంచదారను ఎక్కువగా వాడడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే పంచదారలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది త్వరగా రక్తంలో కలిపి చక్కెర స్థాయిలను పెంచుతుంది. కనుక పంచదార వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పంచదారకు బదులుగా ఇప్పుడు చెప్పే పదార్థాలను వాడడం వల్ల తీపి రుచిని పొందడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి నష్టం కలగదని వారు చెబుతున్నారు. పంచదారకు బదులుగా ఉయోగించదగిన ఇతర పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదారకు బదులుగా మనం స్టెవియా మొక్క ఆకులను ఉపయోగించవచ్చు. స్టెవియా మొక్క ఆకులల్లో క్యాలరీలు ఉండవు. అలాగే దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అయితే దీనిని చాలా తక్కువ మోతాదులో ఉపయోగించాలి. ఎందుకనగా ఈ మొక్క ఆకులు కొద్దిగా చేదు రుచిని కలిగి ఉంటాయి. అలాగే మనం పంచదారకు బదులుగా తేనెను ఉపయోగించవచ్చు. స్వచ్ఛమైన తేనెలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పంచదారకు బదులుగా తేనెను వాడడం వల్ల తీపి రుచిని పొందడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అదే విధంగా పంచదార స్థానంలో మనం మాపుల్ సిరప్ ను కూడా ఉపయోగించవచ్చు. దీనిలో మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే స్వచ్ఛమైన మాపుల్ సిరప్ ను వాడడం వల్ల మాత్రమే మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతాము.
ఇక బెల్లాన్ని వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. బెల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక పంచదారకు బదులుగా బెల్లాన్ని మనం ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే కొబ్బరి చక్కెరను వాడడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. సాధారణ చక్కెర కంటే కొబ్బరి చక్కెర యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే కొద్ది మోతాదులో పోషకాలు,విటమిన్స్, మినరల్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇక పంచదారకు బదులుగా మనం ఖర్జూర పండ్ల పేస్ట్ ను కూడా ఉపయోగించవచ్చు. ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఖర్జూర పండ్ల పేస్ట్ ను పంచదారకు బదులుగా వాడడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే బెర్రీలను కూడా మనం పంచదారకు బదులుగా ఉపయోగించవచ్చు. బ్రేక్ ఫాస్ట్, డిజర్ట్స్ వంటి వాటిలో పంచదారకు బదులుగా సీజనల్ బెర్రీలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా పైన చెప్పిన పదార్థాలను మనం పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పదార్థాలను కూడా తగిన మోతాదులో వాడడం మంచిదని వారు చెబుతున్నారు.