క‌ళ్ల కింద వాపులు వ‌చ్చి ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

క‌ళ్ల కింద కొంద‌రికి అప్పుడ‌ప్పుడు వాపులు వ‌స్తుంటాయి. దీంతో ఇబ్బందిక‌రంగా ఉంటుంది. నీరు ఎక్కువ‌గా చేర‌డం, డీహైడ్రేష‌న్‌, అలర్జీలు.. వంటి కార‌ణాల వ‌ల్ల క‌ళ్ల కింద వాపులు వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌గ్గించుకోవాలంటే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..

క‌ళ్ల కింద వాపులు వ‌చ్చి ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..!

* రోజూ త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్, ఆల‌స్యంగా నిద్ర లేవ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద వాపులు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట వీలైనంత త్వ‌ర‌గా నిద్రించాలి. ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర లేవాలి. రాత్రి పూట ఫోన్లు, కంప్యూట‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం మానేయాలి. దీంతో క‌ళ్ల కింద వాపులు త‌గ్గుతాయి.

* త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద వాపులు వ‌స్తాయి. క‌నుక రోజూ త‌గినంత నీటిని తాగాలి. క‌ళ్ల కింద వాపులు వ‌చ్చిన వారు రోజూ రెండు పూట‌లా ఒక గ్లాస్ కొబ్బ‌రినీళ్ల‌ను తాగాలి. దీంతో ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది.

* విట‌మిన్ సి ఉండే పండ్లు, కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌ళ్ల కింద వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

* క‌ళ్ల కింద వాపులు ఉన్న‌వారు క‌ళ్ల‌ను చ‌ల్ల‌ని నీళ్ల‌తో పూట‌కు ఒక‌సారి శుభ్రం చేసుకోవాలి. దీని వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

* ప్రాణాయామం చేయ‌డం, సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల కూడా క‌ళ్ల కింద వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

* ఒత్తిడి వ‌ల్ల కూడా క‌ళ్ల కింద వాపులు వ‌స్తాయి. క‌నుక ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

Admin

Recent Posts