రోజూ ఉదయం నిద్ర లేవగానే కొందరు టీ, కాఫీలను తాగుతుంటారు. కొందరు నిమ్మకాయ నీళ్లతో తమ రోజును మొదలు పెడతారు. కొందరు నీళ్లను ఎక్కువగా తాగుతారు. అయితే నిజానికి ఉదయం పరగడుపున మనం తీసుకోకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పరగడుపున కారం, మసాలాలు ఉండే ఆహారాలను తినరాదు. తింటే జీర్ణాశయం గోడలపై యాసిడ్ ప్రభావం చూపిస్తుంది. దీంతో అజీర్ణం, కడుపు నొప్పి వస్తాయి. కనుక ఆ ఆహారాలను పరగడుపున తినరాదు.
2. పరగడుపున చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోరాదు. వాటి వల్ల పాంక్రియాస్ (క్లోమ గ్రంథి)పై ఎక్కువ భారం పడుతుంది. దీంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అది డయాబెటిస్‌కు దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని కూడా పరగడుపున తీసుకోరాదు.
3. సోడాలు, కూల్ డ్రింక్స్, గ్యాస్ ఉండే పానీయాలను కూడా పరగడుపున తాగరాదు. అవి గ్యాస్, అసిడిటీ సమస్యలను కలగజేస్తాయి.
4. బాగా చల్లగా ఉండే ఆహారాలను కూడా పరగడుపున తీసుకోరాదు. అవి జీర్ణాశయంలో మ్యూకస్ పొరను దెబ్బ తీస్తాయి. దీంతో అజీర్ణం, మలబద్దకం వస్తాయి.
5. పచ్చి కూరగాయలు, జ్యూస్‌లను పరగడుపున తాగరాదు. బ్రేక్ ఫాస్ట్ చేశాక తీసుకుంటే మంచిది. లేదంటే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి.
6. ఉదయం పరగడుపున టీ, కాఫీలను కూడా తాగరాదు. వీటి వల్ల జీర్ణాశయంలో అసిడిటీ పెరుగుతుంది.
7. పరగడుపున టమాటాలు, అరటి పండ్లను తీసుకోకూడదు. ఇవి జీర్ణ సమస్యలను కలగజేస్తాయి.