కరోనా వైరస్ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు రాకుండా ఉంటాయి.
అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి జ్వరం, దగ్గు, జలుబులను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వాటిల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
పాత్రలో నీటిని తీసుకుని అందులో మిరియాల పొడి, అల్లం వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
పైన తెలిపిన మిశ్రమాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. సీజన్లు మారినప్పుడు సహజంగానే వచ్చే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365