Blood Sugar Levels : మనలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. కారణాలేవైనప్పటికీ ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వ్యాధితో బాధపడే వారు కచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. వీరు ఏది పడితే అది తినడానికి కుదరదు. ఈ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాధితో బాధపడే వారు జీవితాంతం మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ షుగర్ స్థాయిలు నియంత్రణలోకి రాక ఇబ్బందిపడే వారు కూడా ఉన్నారు.
అలాంటి వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహార పదార్థాలతో జ్యూస్ ను చేసుకుని తరచూ తాగడం వల్ల చాలా త్వరగా షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రించే ఆహార పదార్థాలు ఏమిటి.. వీటితో జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో అల్లం, క్యారెట్, గ్రీన్ ఆపిల్, దాల్చిన చెక్క మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
వీటితో జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక జార్ లో ఒక క్యారెట్ ను అలాగే ఒక గ్రీన్ ఆపిల్ ను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులోనే రెండు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత రెండు దాల్చిన చెక్క ముక్కలను, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక గ్లాస్ నీళ్లను వేయాలి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను వడకట్టకుండానే తీసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ ను తయారు చేసుకుని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే అదుపులోకి వస్తాయి.
ఇలా జ్యూస్ ని చేసి తీసుకోవడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులతోపాటు జీర్ణసంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది.
ఈవిధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు పైన తెలిపిన పదార్థాలతో జ్యూస్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి చాలా త్వరగా అదుపులోకి వస్తుంది. ఇలా జ్యూస్ గా చేసుకుని తీసుకోలేని వారు ఆయా ఆహార పదార్థాలను ఆహారంలో భాగంగా తరచూ తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.