మొక్కజొన్నలను సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్కజొన్నలను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడకబెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భలే రుచిగా ఉంటాయి. అయితే వీటితోపాటు పచ్చి మిర్చి కలిపి సలాడ్ చేసుకుని తింటే ఇంకా రుచికరంగా ఉంటాయి. పైగా పోషకాలు కూడా లభిస్తాయి. మరి మొక్కజొన్న-పచ్చిమిర్చి సలాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
మొక్కజొన్న గింజలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 4
వెన్న – 2 టీస్పూన్స్
చక్కెర – 1 టీస్పూన్
మొక్కజొన్న గింజలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వెన్నను వేడి చేసి ఉడికించిన మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి ఉడుకుతుండగా చక్కెరను చల్లుకోవాలి. తీపి అవసరం లేదు, కారంగానే ఉండాలి అనుకుంటే చక్కెరను వేయాల్సిన పనిలేదు. తరువాత తక్కువ మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దించేసుకోవాలి. చల్లారాక కొద్దిగా క్రీమ్ చల్లుకోవచ్చు. దీంతో సలాడ్ రుచిగా ఉంటుంది. కొద్దిగా వేడిగా ఉండగా తింటే భలే రుచిగా అనిపిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365