ఔషధ గుణాల కలబంద.. దీంతో ఏయే అనారోగ్యాలు తగ్గుతాయంటే..?

ఆయుర్వేదంలో కలబందకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కలబంద ఆకుల్లో ఉండే గుజ్జు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. రోజూ కలబందను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కలబంద ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షిస్తుంది. కలబందను ఇంగ్లిష్‌లో అలొవెరా అని పిలుస్తారు.

aloe vera kalabanda gujju upayogalu

కలబంద ఆకులను విరిచి అందులో ఉండే గుజ్జును సేకరించి వేడి చేస్తే పలుచని ద్రవంగా మారుతుంది. దీన్నే హెపాటిక్‌ అలోస్‌ అంటారు. తీవ్రమైన మంటలో వేసి వేడి చేస్తే మరీ పలుచన కాని పదార్థంగా మారుతుంది. దీన్ని గ్లాసీ అలోస్‌గా పిలుస్తారు. ఈ గుజ్జు రుచికి చేదుగా ఉంటుంది. జిగురు గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరానికి చలువ చేస్తుంది. కలబందను మందులా ఆహారంలో వాడవచ్చు. చర్మ సౌందర్య పదార్థంగా కూడా పనిచేస్తుంది.

కలబందలో విటమిన్‌ ఇ, సి, బి1, బి2, బి3, బి6, ఐరన్‌, కాల్షియం, జింక్‌ వంటి పోషకాలు ఉంటాయి. కలబందలో ఉండే శక్తివంతమైన అమైనో యాసిడ్‌లు జీర్ణశక్తిని పెంచుతాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి.

కలబంద గుజ్జును తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లు తగ్గుతాయి. తరచూ విరేచనాల సమస్యతో బాధపడేవారు రోజూ కలబంద గుజ్జును సేవిస్తే ఫలితం ఉంటుంది.

1. రోజూ పరగడుపునే రెండు లేదా మూడు టీస్పూన్ల మోతాదులో కలబంద గుజ్జును తీసుకుంటే పెప్సిన్‌ అనబడే ఎంజైమ్‌ విడుదల అవుతుది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.

2. కలబంద గుజ్జును పరగడుపునే తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

3. కలబంద గుజ్జును తీసుకోవడం వల్ల కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. మన శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్‌ లభిస్తాయి.

4. కలబంద గుజ్జును తీసుకుంటే షుగర్‌ వ్యాధి గ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరానికి శక్తి లభిస్తుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.

5. తరచూ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేవారు రోజూ కలబంద గుజ్జును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అధిక బరువును తగ్గించడంలోనూ కలబంద గుజ్జు ఉపయోగపడుతుంది.

6. గాయలు, పుండ్ల మీద కలబంద గుజ్జును రాస్తే అవి త్వరగా మానుతాయి. కలబంద రసం ఒక కప్పు, కొబ్బరి పాలు అర కప్పు, గోధుమలు అరకప్పు మోతాదులో తీసుకుని రసం తయారు చేయాలి. దాన్ని బాగా కలిపితే షాంపూ తయారవుతుంది. దాన్ని తలకు బాగా మర్దనా చేసి కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.

కలబంద గుజ్జును ముందుగా రోజుకు 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకోవాలి. తరువాత 60 ఎంఎల్‌ వరకు పెంచి తీసుకోవచ్చు. కొందరిలో ఈ గుజ్జు అలర్జీని కలిగిస్తుంది. అలాంటి వారు దీన్ని తీసుకోరాదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సూచన మేరకు కలబంద గుజ్జును వాడుకోవాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts