Biryani Leaves : మన వంటింట్లో ఉండే మసాలా దినుసులల్లో బిర్యానీ ఆకు కూడా ఒకటి. బిర్యానీ, పులావ్ లతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో కూడా మనం ఈ బిర్యానీ ఆకునే ఉపయోగిస్తాము. దీనిని సంస్కృతంలో తేజ పత్ర, పాకరంజన అని, హిందీలో తేజ పత్ అని పిలుస్తారు. కేవలం వంటల్లోనే కాకుండా ఆయుర్వేదంలో ఔషధంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. ఈ ఆకుల చూర్ణం లేదా కషాయం తీపిగా, వగరుగా ఉండి సువాసనను కలిగి ఉంటుంది. దీనిని తీసుకున్న వెంటనే వేడి చేసి తరువాత చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
త్రిదోషాలను, ద్వంద్వ రోగాలను, మూత్ర సంబంధిత సమస్యలను, శూల, వెక్కిళ్లు, అతిసారం, జ్వరాలు, పైత్యపు మంటలు, పొత్తికడుపు సమస్యలు, నోటి సమస్యలను తగ్గించడంలో ఈ బిర్యానీ ఆకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం తేలికైన భావనను కలిగిస్తుంది. శరీరానికి బలాన్ని ఇవ్వడంతోపాటు మానసిక స్థితిని మెరుగుపరచడంలో, పొట్టను శుభ్రపరచడంలో కూడా ఈ ఆకు సహాయపడుతుంది. బిర్యానీ ఆకును ఉపయోగించడం వల్ల మూత్రం సాఫీగా వస్తుంది. స్త్రీలలో నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. చెమట పట్టని శరీరానికి చెమట పట్టేలా చేస్తుంది. భయం, పిరికితనం, నపుంసకత్వం వంటి వాటిని తొలగించడంలో కూడా ఈ బిర్యానీ మనకు దోహదపడుతుంది.
నోటి నుండి ఎక్కువగా నీరు కారడాన్ని కూడా బిర్యానీ ఆకు తగ్గిస్తుంది. ఉబ్బు రోగాన్ని, మూత్రాశయంలో రాళ్లను కరిగించడంలో, మేహ శాంతిని కలిగించడంలో , పొత్తి కడుపులో అయ్యే వ్రణాలను కరిగించడంలో కూడా ఈ బిర్యానీ ఆకు మనకు సహాయపడుతుంది. ఈ ఆకును ఎల్లప్పుడూ నోటిలో ఉంచుకోవడం వల్ల నత్తి త్వరగా తగ్గుతుంది. వస్త్రాలలో బిర్యానీ ఆకులను ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. ఇవే కాకుండా మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా ఈ బిర్యానీ ఆకు మనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.