కుంకుమ పువ్వు ప్రపంచంలోని అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దారం లాంటి ఎరుపు తీగల్లా కుంకుమ పువ్వు ఉంటుంది. ఇది క్రోకస్ సాటివస్ అనే పువ్వు నుండి తయారవుతుంది. దీనిని సాధారణంగా క్రోకస్ అని పిలుస్తారు. కుంకుమ పువ్వు మొదట గ్రీస్‌లో సాగు చేయబడిందని చెబుతారు. కానీ ప్రస్తుతం ఇరాన్, గ్రీస్, మొరాకో, భారతదేశంలలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు.
మన దేశంలో కాశ్మీర్ కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఎక్కువగా అక్కడే పెంచుతారు. ఇది చాలా సూక్ష్మమైనది, సువాసనగలది. కొంచెం తీపి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని అనే రకాల వంటకాల్లో వేస్తుంటారు. అయితే కుంకుమ పువ్వు ద్వారా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తరచూ పాలలో కలుపుకుని తాగడం వల్ల లేదా సలాడ్స్‌లో కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆయుర్వేదంలో కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. పలు ఔషధాల తయారీలో దీన్ని వాడుతారు. ఇది మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
2. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు.
3. కుంకుమ పువ్వు చర్మం, జీర్ణవ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నాడీ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
4. కుంకుమ పువ్వులో పొటాషియం బాగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. గుండెపోటును రాకుండా నివారిస్తుంది.
5. కుంకుమ పువ్వు సహజంగానే స్త్రీ, పురుషులలో లైంగిక శక్తిని పెంచుతుంది. అంగస్తంభన చికిత్సకు కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ఇది బలమైన కామోద్దీపన లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఇది ఆడవారిలో ఆండ్రోజెన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. దీంతోపాటు స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
6. అస్తవ్యస్తమైన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అనేక మంది అనేక శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కుంకుమ పువ్వును వాడడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365