తిప్ప‌తీగ‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఆయుర్వేదంలో ఎంతో పురాత‌న కాలం నుంచి తిప్ప‌తీగ‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. దీన్నే సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. నిజంగా ఈ మొక్క మ‌న‌కు అమృతంలాగే ప‌నిచేస్తుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తిప్పతీగ‌లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్యాన్ని అంద‌జేస్తాయి. ఈ క్ర‌మంలోనే తిప్ప‌తీగ వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

thippatheega benefits in telugu

1. రోగ నిరోధ‌క శ‌క్తి

తిప్ప తీగ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని గ‌ణ‌నీయంగా పెంచుతుంది. ఇందులో ఆల్క‌లాయిడ్లు, లాక్టేన్లు అన‌బ‌డే బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. వ్యాధుల నుంచి ర‌క్షిస్తాయి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపిస్తాయి. ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

2. ఒత్తిడి

ప్రస్తుత త‌రుణంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారికి తిప్ప‌తీగ దివ్య ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు. ఇది శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డ‌మే కాక మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉంటుంది.

3. ఆర్థ‌రైటిస్

తిప్ప‌తీగ‌లో యాంటీ ఆర్థ‌రైటిస్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల కీళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కీళ్లు వాపుల‌కు గుర‌వ‌డం వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే తిప్ప తీగ కీళ్ల వాపుల‌ను త‌గ్గిస్తుంది. ఈ క్ర‌మంలో ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. డ‌యాబెటిస్

తిప్ప‌తీగ మ‌న శ‌రీరంలో ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. తిప్ప‌తీగ‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి వ‌ల్ల వ‌చ్చే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

5. శ్వాస స‌మ‌స్య‌లు

తిప్ప‌తీగ‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో జ‌లుబు, ద‌గ్గు త‌గ్గుతాయి. తిప్ప‌తీగ‌లో ఉండే ఔష‌ధ గుణాలు శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం తిప్ప‌తీగ ఈ స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేస్తుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఈ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

6. జీర్ణ ప్ర‌క్రియ

ప్ర‌స్తుతం అనేక మంది పాటిస్తున్న అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వారికి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా అజీర్ణం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అలాంటి వారు తిప్ప‌తీగ‌ను నిత్యం తీసుకోవాలి. తిప్ప‌తీగ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. చాలా మంది తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేద‌ని అంటుంటారు. అలాంటి వారు ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం తిప్ప‌తీగ‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

7. తీవ్ర‌మైన జ్వ‌రం

ఫ్లూ, ఇత‌ర వైర‌ల్ జ్వ‌రాలు వ‌చ్చిన వారు తిప్ప‌తీగ‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. తిప్ప‌తీగ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

గమ‌నిక: తిప్ప‌తీగ‌ను గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు తీసుకోరాదు.

Admin

Recent Posts