Acidity Remedies : మారిన జీవన విధానం కారణంగా చాలా మంది పనుల్లో పడి సమాయానికి ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఇలా సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మనం భవిష్యత్తుల్లో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడే వారు వీటి నుండి ఉపశమనం పొందడానికి ఏవేవో మందులను వాడుతుంటారు. ఇలా మందులను వాడడం వల్ల మనం మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ గ్యాస్, అసిడిటీ సమస్యలను మనం ఇంటి చిట్కా ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. ఇంటి చిట్కాను పాటించడం వల్ల సమస్య తగ్గు ముఖం పట్టడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాం. ఈ చిట్కాను పాటించడం వల్ల గ్యాస్, ఎసిడిటి సమస్యల నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గ్యాస్ సమస్యలతో బాధపడే వారికి జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపులో గ్యాస్ , అసిడిటీ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల వేడి చేసే అవకాశం ఉంది. ఇలా జీలకర్రను నేరుగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యల నుండి ఉశమనం కలుగుతుంది. ఈ చిట్కాను రోజులో ఎప్పుడైనా కూడా పాటించవచ్చు.
అలాగే గ్యాస్, ఎసిడిటీ సమస్యలను తగ్గించడంలో సోంపు గింజలు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. సోంపు గింజలతో కొద్దిగా బెల్లంముక్కను కూడా నోట్లో వేసుకుని నమలడం వల్ల గ్యాస్ సమస్య నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సోంపూ మనకు ఎంతో సహాయపడుతుంది. ఈ చిట్కాను భోజనం చేసిన తరువాత పాటించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా గ్యాస్, అసిడిటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వీటిని పాటించిన రెండు రోజుల్లోనే మనకి చక్కటి ఫలితం కబడుతుంది.