కలబందను భారతీయులు ఎంతో పురాతన కాలంగా వాడుతున్నారు. ఈ మొక్క దాదాపుగా అందరి ఇళ్లలోనూ పెరుగుతుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కలబందను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో పలు రకాల ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారు. అలొవెరాలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది చర్మం, వెంట్రుకలకు సంరక్షణనిస్తుంది. దీంతో చర్మాన్ని, వెంట్రుకలను ఇలా సురక్షితంగా ఉంచుకోవచ్చు.
కలబంద ఆకుల్లో ఉండే గుజ్జుతో పలు రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాల తరువాత కడిగేయాలి. దీంతో చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీన్ని కిచెన్‌లో ఉండే ఇతర పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్‌లను తయారుచేసుకుని వాడవచ్చు. అలాగే కాలిన గాయాలు, పుండ్లు, ఇతర మచ్చలపై అలొవెరా జెల్‌ను రాస్తూ ఉంటే అవి మానిపోతాయి.
అలొవెరా వెంట్రుకలను కూడా సంరక్షిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అలొవెరా జెల్‌ను జుట్టుకు, జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేస్తూ రాయాలి. అనంతరం కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య పోతుంది. వెంట్రుకలు రాలవు. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఈ సమస్యకు అలొవెరాతో చెక్ పెట్టవచ్చు. అలొవెరా జెల్‌లో కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి బాగా రుద్దాలి. దీంతో పాదాలపై ఉండే మృతకణాలు పోతాయి. పాదాల పగుళ్లు తగ్గుతాయి. అయితే అలొవెరాకు చక్కెరకు బదులుగా తేనెను కూడా కలిపి పాదాలకు రాయవచ్చు. ఇలా చేసినా ఆ సమస్య తగ్గుతుంది.
చాలా మంది మహిళలు నిత్యం తాము వేసుకుని మేకప్‌ను తీసేందుకు మేకప్ రిమూవర్లను వాడుతుంటారు. అవి సాధారణంగా కెమికల్స్‌తో తయారైనవే అయి ఉంటాయి. అవి చర్మానికి హాని చేస్తాయి. వాటితో చర్మం పొడిగా మారి కణాలు నశిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే అలొవెరా జెల్‌ను వాడవచ్చు. అలొవెరా జెల్‌ను మేకప్ రిమూవర్‌గా వాడవచ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా చర్మం సంరక్షింపబడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365