Feet Beauty : మనలో చాలా మంది ముఖం అందంగా కనబడితే చాలు అనుకుంటారు. ముఖం అందంగా కనబడడానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర శరీర భాగాలపై అంత శ్రద్దను చూపించరు. దీంతో ముఖం తెల్లగా, పాదాలు నల్లగా మారతాయి. ముఖంతో పాటు పాదాలు కూడా అందంగా ఉంటేనే మనం మరింత అందంగా కనబడతాము. ముఖంపై ఎలా అయితే దుమ్ము, ధూళి, మృతకణాలు పేరుకుపోతాయే అదే విధంగా పాదాలపై కూడా దుమ్ము, ధూళి, మృతకణాలు, మురికి పేరుకుపోతుంది. ఎండ కారణంగా పాదాలు కూడా నల్లగా మారతాయి. ఈ చిన్న చిట్కాను ఉపయోగించి ఇన్ స్టాంట్ గా మనం మన పాదాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేయడం అలాగే వాడడం కూడా చాలా తేలిక.
ఈ చిట్కాను వాడడం వల్ల పాదాలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి పాదాలు తెల్లగా మారతాయి. పాదాలను తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో సగం టమాట రసాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ వంటసోడాను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పాదాలకు రాసుకునే ముందు పాదాలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. తరువాత 4 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు పాదాలపై అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
తరువాత పాదాలకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ ను లేదా పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే నలుపు, మృతకణాలు, బ్యాక్టీరియా తొలగిపోతుంది. అలాగే టమాట, నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే నలుపును తగ్గించడంలో సహాయపడతాయి. వంటసోడా చర్మాన్ని తెల్లగా మార్చడంలో సహాయపడతాయి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం పాదాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పాదాలతో పాటు మెడ, చేతులు. మోకాళ్లు, మేచేతులు వంటి ఇతర శరీర భాగాలపై కూడా రాసుకోవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల పాదాలపై ఉండే నలుపు చాలా తొందరగా తొలగిపోతుంది. పాదాలు తెల్లగా మారతాయి.