Hibiscus Hair Pack : మనలో ప్రతి ఒక్కరూ జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా ఉండాలని కోరుకుంటుంటారు. దీని కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జుట్టు సమస్యలతో బాధపడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. ఆయుర్వేదం ద్వారా ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా మనం జుట్టు సమస్యల నుండి బయట పడవచ్చు. జుట్టు సమస్యల నుండి బయట పడడానికి మనం ఏయే పదార్థాలను ఎంత పరిమాణంలో ఉపయోగించాలి.. ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మందికి మందార ఆకును ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుందని తెలుసు. కనుక రెండు గుప్పిళ్ల మందార ఆకును, రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును, రెండు టేబుల్ స్పూన్ల పెరుగును జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. ఈవిధంగా పట్టించిన తరువాత ఒక గంట పాటు ఆగి.. వేడి నీటితో తలస్నానం చేయాలి.
ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు పొడి బారడం, జుట్టు చివర్లు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది. అంతే కాకుండా ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోనే చాలా సులువుగా ఎటువంటి ఖర్చు లేకుండా జుట్టు సమస్యలన్నింటినీ తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.