Baking Soda : మనం వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసినప్పుడు అవి పొంగి చక్కగా రావడానికి గాను వంట సోడా (బేకింగ్ సోడా)ను ఉపయోగిస్తూ ఉంటాం. వంట సోడాను ఉపయోగించడం వల్ల మనం తయారు చేసే ఆహార పదార్థాలు చక్కగా రావడంతోపాటు ఆహార పదార్థాల రుచి కూడా పెరుగుతుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒకటేనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి రెండూ ఒకటి కాదు. వేర్వేరు. బేకింగ్ సోడా గాఢతఎక్కువగా ఉంటుంది. బేకింగ్ పౌడర్ గాఢత తక్కువగా ఉంటుంది. వంటలలోనే కాకుండా బేకింగ్ సోడాను ఉపయోగించి వివిధ రకాల చర్మ, దంత సంబంధమైన సమస్యలను తగ్గించుకోవచ్చు.
సౌందర్య సాధనంగా కూడా బేకింగ్ సోడాను వాడవచ్చు. బేకింగ్ సోడాతో ఏ విధమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనిని ఏ విధంగా వాడాలి.. లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి చర్మం నిగారిస్తుంది. ముఖంపై వచ్చే బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో బేకింగ్ సోడా ఎంతగానో సహాయపడుతుంది. బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి ఆ నీటిని ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గి ముఖం తెల్లగా మారుతుంది. కళ్ల కింద ఉండే నల్లని వలయాలు కూడా తొలగిపోతాయి. చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి చర్మం నిగారిస్తుంది.
బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేయడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం పోయి దంతాలు తెల్లగా మారుతాయి. అంతే కాకుండా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సొడాను వేడి నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. మూత్ర పిండాలలో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడాను కలిపి ప్రతి రోజూ తాగడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మెడ, చంకలు, మోకాళ్ల దగ్గర ఉండే నలుపును తొలగించడంలో కూడా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను కొబ్బరి నూనెలో కలిపి నల్లగా ఉన్న దగ్గర రాసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నలుపుదనం తగ్గుతుంది.
గోళ్లలో ఫంగస్ ఇన్ ఫెక్షన్ లు వచ్చినపప్పుడు బేకింగ్ సోడాలో నిమ్మ రసం కలిపి ఆ మిశ్రమాన్ని గోరుపై రాస్తూ మర్దనా చేయడం వల్ల ఫంగస్ ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది. చిన్న చిన్న కీటకాలు కుట్టిన చోట బేకింగ్ సోడాను పేస్ట్ లా చేసి రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది. మొక్కలకు పట్టే చీడ పీడలను తొలగించడంలోనూ బేకింగ్ సోడా సహాయపడుతుంది. నీళ్లలో బేకింగ్ సోడాను కలిపి మొక్కలపై చల్లడం వల్ల మొక్కలకు పట్టిన చీడ తొలగిపోతుంది. బేకింగ్ సోడాతో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి ఇది అధిక గాఢతను కలిగి ఉంటుంది. కనుక దీనిని తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. బేకింగ్ సోడాను వంటలలో కూడా తక్కువగానే ఉపయోగించాలి. బేకింగ్ సోడాను తగిన మోతాదులో ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.