చర్మం కాంతివంతంగా మారాలని ఆశిస్తున్నారా ? అయితే అందుకు కలబంద (అలొవెరా) ఎంతో ఉపయోగపడుతుంది. అలొవెరా చర్మాన్ని సంరక్షిస్తుంది. కింద తెలిపిన స్టెప్స్‌ను పాటిస్తూ అలొవెరాను ఉపయోగించి సహజసిద్ధంగా చర్మ కాంతిని పెంచుకోవచ్చు. ఆ స్టెప్స్ ఒక్కసారి చూద్దామా..!
1. కలబంద మొక్క నుంచి కాడలను సేకరించాలి.
2. కాడలను ఒక వైపు పైన పొట్టు తీసి లోపల ఉండే గుజ్జును సేకరించి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.
3. రెండు కలబంద కాడల నుంచి సేకరించిన గుజ్జులో సగం నిమ్మకాయను పూర్తిగా పిండాలి.
4. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలో నిల్వ చేయాలి.
5. ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఒక వారం పాటు ఉంచవచ్చు.
ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసి 1-2 గంటల తరువాత కడిగేయాలి. రాత్రి పూట కూడా ఆ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఆ మిశ్రమాన్ని రాసి రాత్రంతా ముఖాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే కడిగేయాలి.
ఇలా వారంలో 2-3 సార్లు చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాసి ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేయవచ్చు. దీంతో జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య ఉండదు. అయితే ఆ మిశ్రమంలో విటమిన్ ఇ ట్యాబ్లెట్ కలిపి ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.