తిప్పతీగకు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్యత ఉంది. అనేక ప్రయోజనాలను చేకూర్చే మూలిక ఇది. దీన్ని అనేక ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. తిప్పతీగకు చెందిన చూర్ణం మనకు బయట మార్కెట్లలో లభిస్తుంది. అయితే చూర్ణానికి బదులు జ్యూస్‌ను కూడా తాగవచ్చు. దీన్ని కూడా మార్కెట్‌లో పలు కంపెనీలు విక్రయిస్తున్నాయి. తిప్పతీగ జ్యూస్‌ను ఎలా తాగాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిప్పతీగ జ్యూస్‌ను నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాల్సి ఉంటుంది. 2 నుంచి 3 టీస్పూన్ల మోతాదులో దీన్ని తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
* తిప్పతీగ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల తీవ్రమైన జ్వరం కూడా తగ్గుతుంది.
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
* ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా అజీర్తి సమస్య తగ్గుతుంది.
* ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు తగ్గుతాయి.
* కంటి చూపు పెరుగుతుంది.
తిప్పతీగ జ్యూస్‌ను సేవించాక కనీసం 30 నిమిషాల పాటు ఆగి ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.