Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు అందానికి చిట్కాలు

Pigmentation : ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను పోగొట్టే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

D by D
March 2, 2023
in అందానికి చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Pigmentation : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న చ‌ర్మంపై వ‌చ్చే మంగు మ‌చ్చ‌ల‌ను, న‌ల్ల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కా త‌యారీలో ఉప‌యోగించిన ప్ర‌తి ప‌దార్థం కూడా మంగు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది ముఖంపై మంగు మ‌చ్చ‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇవి ఎక్కువ‌గా ముక్కు మీద‌, బుగ్గ‌ల మీద‌, నుదుటి మీద వ‌స్తూ ఉంటాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, పోష‌కాహార లోపం, ఒత్తిడి, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందుల‌ను వాడ‌డం, శ‌రీరంలో ఉండే వివిధ ర‌కాల ఇన్ఫెక్ష‌న్స్, శ‌రీరంలో మ‌లినాలు పేరుకుపోవ‌డం వంటి వాటి వ‌ల్ల‌ ముఖంపై మంగు మచ్చ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు వ‌స్తూ ఉంటాయి. ఈ మ‌చ్చ‌లు స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ వ‌స్తాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు త‌గ్గి ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు.

అందుకోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఒక చ‌క్క‌టి సులువైనా చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను, న‌ల్ల‌మ‌చ్చ‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం మెంతి ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. మెంతిఆకుల్లో ఉండే ఔష‌ధ గుణాలు మెల‌నిన్ ఉత్ప‌త్తిని త‌గ్గించి చ‌ర్మం తెల్ల‌గా మార‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే మ‌నం బంగాళాదుంప‌ను కూడా ఉప‌యోగించాల్సి ఉంటుంది. బంగాళాదుంప బ్లీచింగ్ ఏజెంట్ గా ప‌ని చేస్తుంది. ఇది చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ముందుగా బంగాళాదుంప‌పై ఉండే చెక్కును తీసివేయాలి. త‌రువాత ఒక జార్ లో మెంతి ఆకుల‌ను, అర చెక్క బంగాళాదుంప‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్టుకుని దాని నుండి వచ్చే ర‌సాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

Pigmentation home remedy works effectively how to prepare it
Pigmentation

త‌రువాత ఈ మిశ్ర‌మంలో ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ ముల్తానీ మ‌ట్టి వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి రాసుకుని ఆరిన త‌రువాత నీటితో క‌డిగి వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ చిట్కాను వాడిన ప‌ది నుండి ప‌దిహేను రోజుల్లోనే మ‌నం ముఖంలో వ‌చ్చే మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా సుల‌భంగా ముఖంపై ఉండే మంగు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

Tags: Pigmentation
Previous Post

Kakarakaya Patoli : కాక‌ర‌కాయ ప‌టోలి.. త‌యారీ ఇలా.. చిన్నారులు సైతం ఎంతో ఇష్టంగా తింటారు..!

Next Post

Tomato Perugu Pachadi : ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డిని చాలా సింపుల్‌గా ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Related Posts

international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025
హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.