Coconut Milk For Hair : ఈ పాలను మన మన జుట్టుకు పట్టిస్తే చాలు జుట్టు సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ పాలను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు రాలడంతో అనే సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ పాలు అద్భుతంగా పని చేస్తాయి. మనలో చాలా మంది ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వంటి వాటి వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ పాలు మనందరికి తెలిసినవే. అవే కొబ్బరి పాలు. కొబ్బరి పాలల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో ఎంతగానో సహాయపడతాయి. దెబ్బతిన్న జుట్టును కూడా ఈ కొబ్బరి పాలు తిరిగి ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది. అయితే ఈ కొబ్బరి పాలను మనం బయట కొనుగోలు చేసే అవసరమే లేదు. వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకోవాలి. తరువాత అందులో ఉండే కొబ్బరిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఈ కొబ్బరి పేస్ట్ ను ఒక వస్త్రంలోకి తీసుకుని మూటకట్టాలి. తరువాత దానిని గట్టిగా పిండుతూ కొబ్బరి పాలను గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పాలను జుట్టుకు పట్టించే ముందు జుట్టు శుభ్రంగా నూనె లేకుండా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఈ కొబ్బరి పాలను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే రసాయనాలు తక్కువగా షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చేయడం వల్ల జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ చిట్కాను కనీసం 3 నెలల పాటు వాడితేనే మనం మన జుట్టులో వచ్చే మార్పును గమనించవచ్చు. ఈ విధంగా కొబ్బరి పాలను వాడడం వల్ల చాలా సులభంగా జుట్టును ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా, పట్టుకుచ్చులా మార్చుకోవచ్చు.