Coriander For Sleep : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుందనే చెప్పవచ్చు. మనం రాత్రంతా సరిగ్గా నిద్రిస్తేనే మరుసటి రోజూ ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. నిద్రలేమి సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన మన జీవన విధానం, ఒత్తిడి, ఆందోళన, మనం తీసుకునే ఆహారం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం వంటి అనేక రకాల కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సరిగ్గా నిద్రించకపోవడం వల్ల కూడా మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
నిద్రలేమి కారణంగా ఊబకాయం, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, నీరసం, రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేక పోవడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే మతిమరుపు, ఆల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం, మెదడు పనితీరు దెబ్బతినడం, దేని మీద దృష్టి సాధించలేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా నిద్రలేమి కారణంగా వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా వస్తాయి. నిద్రలేమి ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది కనుక మనం తగినంత నిద్రపోవడం చాలా అవసరం. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి నిద్ర మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి.
ఒక చక్కటి ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. నిద్రలేమిని దూరం చేయడంలో మనకు ధనియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు తలనొప్పి, ఒత్తిడి వంటి వాటిని దూరం చేసి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ధనియాలను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ధనియాలను ఎలా ఉపయోగించడం వల్ల మనం నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలను వేసుకుని బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాలను వేసి 3 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి.
ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మనం చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా ధనియాలను ఉపయోగించడం వల్ల మనం నిద్రలేమి సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.