Doosari Teega : దూసరి తీగ.. తీగ జాతికి చెందిన ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువగా గ్రామాల్లో అలాగే రోడ్లకు ఇరు వైపులా చెట్లకు, కంచెలకు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. రైతులకు ఈ తీగ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ తీగతో దూడల మూతులకు చిక్కాలను అల్లుతూ ఉంటారు. అలాగే ఈ తీగతో బుట్టలు, తట్టలు కూడా అల్లుతారు. చాలా మంది దూసరి తీగ ఎందుకు పనికి రాదు అనుకుంటారు. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని ఔషధంగా ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ మొక్కను సంస్కృతంలో పాతాళ గరుడ అని, హిందీలో చిరహటా అని, తెలుగులో శిబ్బి తీగ అని పిలుస్తారు. ఈ తీగ చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
ఈ తీగ ఆకులు, వేర్లు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. దూసరి తీగ ఆకులను ఉపయోగించడం వల్ల మనం డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. 10 గ్రాముల దూసరి తీగ ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో అర గ్లాస్ గోరు వెచ్చని ఆవు పాలను పోసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రెండు పూటలా తాగుతూ ఉంటే మధుమేజహం క్రమంగా తగ్గుతుంది. అతి మూత్రం సమస్యతో బాధపడే వారికి కూడా దూసరి తీగ ఎంతో మేలు చేస్తుంది. దూసరి తీగ ఆకులను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని పూటకు 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా అర కప్పు వేడి నీటితో తాగుతూ ఉంటే అతి మూత్రం సమస్య తగ్గుతుంది. అలాగే పురుషుల్లో వచ్చే స్వప్నస్కలనం సమస్యను తగ్గించడంలో కూడా దూసరి తీగ ఎంతో సహాయపడుతుంది.
దూసరి తీగ ఆకుల పొడి 100 గ్రా., అలాగే పటిక బెల్లం పొడి 120 గ్రా., కరక్కాయ పొడి 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. కరక్కాయలను నెయ్యిలో వేయించి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రెండు పూటలా ఒక చెంచా మోతాదులో ఆవు పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే స్వప్న స్కలనం సమస్యతగ్గిపోతుంది. ఎటువంటి సమస్య లేనప్పటికి కొందరు స్త్రీలకు సంతానం కలగదు. అలాంటి స్త్రీలు దూసరి తీగ ఆకులను పొత్తి కడుపుపై ఉంచి కట్టుకట్టాలి. వీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తీసి వేయాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల ఆ స్త్రీకి సంతానం కలుగుతుంది. దూసరి తీగ ఆకులను దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 30 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 30 గ్రాముల పటిక బెల్లం పొడిని కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తాగుతూ ఉంటే అన్ని రకాల సెగ రోగాలు తగ్గుతాయి. అలాగే పాము కాటుకు గురి అయినప్పుడు దూసరి తీగ దుంపను నీటితో నూరి 50 గ్రాముల మోతాదులో పాము కాటుకు గురి అయిన వారికి తాగించాలి. ఇలా తాగించడం వల్ల పాము విషం హరించుకుపోతుంది. అలాగే దూసరి తీగకు పూజ చేసి దాని వేర్లను సేకరించాలి. తరువాత ఈ వేర్లను ఇంటిగుమ్మానికి కట్టాలి. ఇలా కట్టడం వల్ల పాములు ఇంటి పరిసరాలల్లోకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా దూసరి తీగ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.