Ear Itching : చెవుల్లో దుర‌ద‌, చెవిపోటుకు.. అద్భుత‌మైన చిట్కా..!

Ear Itching : మ‌నం అప్పుడ‌ప్పుడూ చెవి స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటాం. చెవి నుండి చీము కార‌డం, చెవి పోటు, చెవిలో దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. చెవి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డడానికి మ‌నం వైద్యున్ని సంప్ర‌దించి అనేక ర‌కాల చెవిలో వేసుకునే చుక్క‌ల మందుల‌ను వాడుతూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య‌లు ఒక్కోసారి త‌గ్గ‌వు.

ఈ చెవి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే పరిష్కారాలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చెవి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌టప‌డ‌డంలో మ‌న‌కు ఆవ నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మ‌న పోపుల డ‌బ్బాలో ఉండే ఆవాల నుండి తీసే ఈ ఆవ నూనె మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో ఈ నూనెను విరివిరిగా ఉప‌యోగిస్తారు. చెవి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఆవ నూనె ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Ear Itching how you can get rid of it with this remedy
Ear Itching

చెవి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు 50 గ్రాముల ఆవ నూనెను తీసుకుని అందులో 20 గ్రాముల న‌ల్ల తుమ్మ చెట్టు పువ్వుల‌ను వేయాలి. ఈ నూనెను చిన్న మంట‌పై న‌ల్ల తుమ్మ చెట్టు పువ్వులు న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఇలా వ‌డ‌క‌ట్టిన నూనెను నిల్వ చేసుకుని రోజుకు రెండు పూట‌లా 4 నుండి 5 చుక్క‌ల నూనెను చెవుల్లో గోరు వెచ్చ‌గా వేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెవి పోటు, చెవి నుండి చీము కార‌డం, చెవుల్లో దుర‌ద వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చెవి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

D

Recent Posts