Flaxseeds Powder For Belly Fat : మనకు సులభంగా లభించే పదార్థాలను ఉపయోగించి ఒక పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ పొడిని రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా తేలిక. ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అధిక బరువు సమస్య నుండి బయటపడేసే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ మనం సోంపు గింజలను, పసుపును, అవిసె గింజలను, జీలకర్రను, కరివేపాకును, కరక్కాయను, సైంధవ లవణాన్ని, ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో, ఆయుర్వేద షాపుల్లో ఈ వస్తువులన్నీ మనకు సులభంగా లభిస్తాయి.
ముందుగా 25 గ్రాముల అవిసె గింజలను, 50 గ్రాముల సోంపును,25 గ్రాముల జీలకర్రను చిన్న మంటపై విడివిడిగా వేయించి పక్కకు ఉంచాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిలో 25 గ్రాముల కరక్కాయ పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సైంధవ లవణం, 2 చిటికెల ఇంగువ, 25 గ్రాముల కరివేపాకు పొడి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ రాత్రి పడుకునే గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో వేసి కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.
మరింత త్వరగా ఫలితం కావాలనుకున్న వారు దీనిని ఉదయం అల్పాహారం చేసిన గంట తరువాత అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన గంట తరువాత తీసుకోవాలి. ఈ విధంగా ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. అంతేకాకుండా ఈ పొడిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు బయట లభించే జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. నేటి తరుణంలో చాలా మంది అధిక బరువు, అధిక పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.