Weight Loss Tips: మెంతులను నిత్యం రక రకాల కూరల్లో వేస్తుంటారు. భారతీయులు మెంతులను రోజూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. మెంతుల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువును తగ్గించడంలోనూ మెంతులు చక్కగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కూడా రోజూ మెంతులను తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
అధిక బరువు పెరుగుతున్నామని, బరువు అధికంగా ఉన్నామని దిగులు చెందేవారు రోజూ మెంతులను తీసుకోవాలి. అందుకుగాను మెంతులను ఇలా ఉపయోగించాల్సి ఉంటుంది.
1. అధిక బరువు తగ్గేందుకు రోజూ మెంతుల నీళ్లను తాగాలి. ఉదయం పరగడుపున మెంతుల నీళ్లను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇందుకు గాను ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ మెంతులను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. తరువాత మెంతులను తినాలి. దీంతో అధిక బరువు తగ్గుతారు.
2. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ మెంతులను వేసి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక దాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే కప్పు మోతాదులో తాగేయాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తాగాలి. బరువు తగ్గుతారు.
3. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో మెంతులు, అల్లం, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. ఇలా వారంలో 3 సార్లు తాగితే ప్రయోజనం ఉంటుంది.
4. మెంతులను మొలకెత్తించి కూడా తినవచ్చు. మొలకెత్తిన మెంతులను రోజూ గుప్పెడు మోతాదులో పరగడుపునే తింటే బరువు తగ్గుతారు.
5. ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ మెంతులను కొద్దిగా తేనెతో కలిపి తినేయాలి. ఇలా రోజూ చేసినా అధిక బరువును తగ్గించుకోవచ్చు.