Mucus : క‌ఫంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా.. అయితే ఇలా చేయండి..!

Mucus : చ‌లికాలంలో మ‌న‌లో చాలా మంది ఊపిరితిత్తుల్లో క‌ఫం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ క‌ఫాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల బ్రాంకైటిస్ స‌మ‌స్య నుండి నిమోనియా వ‌ర‌కు అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య కార‌ణంగా చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు అంద‌రూ ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం చాలా సుల‌భంగా తొల‌గిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ద‌గ్గు, జలుబు, గొంతు గ‌ర‌గ‌ర వంటి స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాము. క‌ఫాన్ని తొల‌గించ‌డంలో అల్లం మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

క‌ఫంతో పాటు చ‌లికాలంలో వ‌చ్చే జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అల్లం మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అల్లం టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల లేదా అల్లం రసాన్ని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌ఫం నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వెల్లుల్లి రెబ్బ‌లను నేరుగా న‌మిలి తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫం తొల‌గిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే తేనెను గోరు వెచ్చ‌టి నీటిలో వేసి పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, క‌ఫం వంటి స‌మ‌స్య‌ల‌ను చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

home remedies for Mucus follow these
Mucus

అదే విదంగా క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఫైనాఫిల్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన క‌ఫాన్ని పూర్తిగా క‌రిగించడంతో పాటు రోగ నిరోధ‌క శక్తిని పెంచే గుణం కూడా దీనికి ఉంది. పైనాపిల్‌ ను తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గుతో పాటు ఇత‌ర క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌ల నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా అతి మ‌ధురం వేరును నీటిలో వేసి కషాయంలా చేసుకోవాలి. ఈ క‌షాయాన్ని వ‌డ‌క‌ట్టుకుని తాగ‌డం వ‌ల్ల క‌ఫం తొల‌గిపోతుంది. ఈ అతి మ‌ధురం మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అలాగే క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌డంలో మ‌న‌కు యాల‌క్కాయ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. యాల‌క్కాయ‌ల‌ను దంచి నీటిలో వేసి మరిగించాలి.

త‌రువాత ఈ నీటిని గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే తాజాగా ఉన్న 5 లేదా 6 పుదీనా ఆకుల‌ను తీసుకుని నీటిలో వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటికి నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల క‌ఫం త్వ‌ర‌గా క‌రిగిపోతుంది. చ‌లికాలంలో క‌ఫం తో పాటు ఇత‌ర క‌ఫ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో చాలా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా స‌లుభంగా శ‌రీరంలో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించుకోవ‌చ్చ‌ని ఈ చిట్కాల‌ను వాడ‌డం వల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts