Home Remedies : గొంతు గరగర సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Home Remedies : సాధారణంగా కాలాలకు అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే శీతాకాలం మొదలవడంతో చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలతో బాధపడేవారికి గొంతు గరగర అంటూ.. ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇలా గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా తగ్గదు. అయితే ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే  త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Home Remedies for throat problems and infections

1. గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఒక టేబుల్ స్పూను వామును నోట్లో వేసుకుని బాగా చప్పరించి రసం మింగటం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

2. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగటం వల్ల గొంతు గరగర సమస్యతో పాటు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.

3. ఈ సమస్యతో బాధపడేవారు చిన్నసైజు అల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే గొంతు మంట కలిగే అవకాశం ఉంటుంది.

4. వెల్లుల్లి ఎన్నో ఔషధ గుణాలని కలిగి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వెల్లుల్లిలో కొద్దిగా ఉప్పు, కారం వేసి మెత్తని మిశ్రమంలా చేసుకుని వేడి అన్నంలోకి తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Share
Sailaja N

Recent Posts