Home Remedies : సాధారణంగా కాలాలకు అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే శీతాకాలం మొదలవడంతో చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలతో బాధపడేవారికి గొంతు గరగర అంటూ.. ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇలా గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా తగ్గదు. అయితే ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
1. గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఒక టేబుల్ స్పూను వామును నోట్లో వేసుకుని బాగా చప్పరించి రసం మింగటం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
2. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగటం వల్ల గొంతు గరగర సమస్యతో పాటు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. ఈ సమస్యతో బాధపడేవారు చిన్నసైజు అల్లం ముక్కను నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే గొంతు మంట కలిగే అవకాశం ఉంటుంది.
4. వెల్లుల్లి ఎన్నో ఔషధ గుణాలని కలిగి ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వెల్లుల్లిలో కొద్దిగా ఉప్పు, కారం వేసి మెత్తని మిశ్రమంలా చేసుకుని వేడి అన్నంలోకి తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.