Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

బాలింతల్లో పాలు బాగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

Admin by Admin
May 27, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

చిన్నారులకు తల్లి పాలు పట్టించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. తల్లి పాలలో అనేక పోషకాలు ఉంటాయి. వాటితో పిల్లలకు పోషణ అందుతుంది. వారు చురుగ్గా ఉంటారు. ప్రతిభావంతులుగా మారుతారు. అందుకని చిన్నారులకు కచ్చితంగా తల్లిపాలను ఇవ్వాలి. అయితే కొందరు బాలింతలలో బాగా ఉత్పత్తి కావు. దీంతో చిన్నారులకు వారు తగినన్ని పాలను తాగించలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే తల్లిపాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…

how to increase milk production in mothers

1. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ మెంతులను వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి అందులో ఒక టీస్పూన్‌ తేనెను కలిపి తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే బాలింతల్లో పాలు బాగా పెరుగుతాయి. మెంతుల్లో ఉండే ఫైటోఈస్ట్రోజన్‌ పాలను బాగా ఉత్పత్తి చేస్తుంది.

2. మునగకాయలను శుభ్రం చేసి వాటిపై ఉండే పొట్టు తీసి వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి. దాన్ని అర కప్పు మోతాదులో రోజుకు ఒకసారి తాగితే ఫలితం ఉంటుంది.

3. బాలింతల్లో పాలు ఉత్పత్తి అయ్యేందుకు సోంపు గింజలు కూడా పనిచేస్తాయి. ఇందుకు గాను ఒక పాత్రలో కొన్ని సోంపు గింజలు వేసి బాగా మరిగించాలి. అనంతరం వడకట్టి ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేయాలి. పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.

4. వెల్లుల్లిలో లాక్టోజెనిక్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి బాలింతల్లో పాలను పెంచుతాయి. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి నేరుగా తినాలి. లేదా ఆహారంలో చేర్చుకుని తినవచ్చు. దీంతో పాలు ఉత్పత్తి అవుతాయి.

5. పాలు బాగా లేని తల్లులకు దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో డికాషన్‌ తయారు చేసుకుని తాగాలి. లేదా చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో పాలు ఉత్పత్తి అవుతాయి.

6. బాదం పప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి బాలింతలకు మేలు చేస్తాయి. రోజూ నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తినాలి. లేదా బాదం పాలు తాగాలి. బాలింతల్లో పాలు పెరుగుతాయి.

బాలింతలు ఆరోగ్యకరమైన పోషకాహారం తినాలి. స్తనాలను రోజూ సున్నితంగా మర్దనా చేయాలి. బిగుతైన లో దుస్తులు ధరించరాదు. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాలు బాగా పడతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: breast feeding womanbreast milkత‌ల్లి పాలుపాలిచ్చే త‌ల్లులుబాలింత‌లు
Previous Post

ముల్లంగితో ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Next Post

తరచూ వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు..!

Related Posts

చిట్కాలు

తులసి ఆకుల‌తో ఇలా చేయండి.. చుండ్రు అన్న మాటే వినిపించ‌దు..

May 27, 2025
చిట్కాలు

వేపాకుల‌తో ఇలా చేస్తే.. మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండ‌దు..

May 27, 2025
చిట్కాలు

ఈ చిట్కాను పాటిస్తే చాలు.. మీ జుట్టు రాల‌డం పూర్తిగా త‌గ్గిపోతుంది..

May 26, 2025
చిట్కాలు

ఆస్త‌మా స‌మ‌స్య ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాల‌ను పాటించండి..

May 26, 2025
చిట్కాలు

జీర్ణాశ‌యంలో అల్స‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

May 26, 2025
చిట్కాలు

నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి..

May 25, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
politics

మ‌న రాష్ట్ర‌ప‌తి వాడే గుర్ర‌పు బండిని..పాకిస్థాన్ పై టాస్ లో గెలుచుకున్నామ‌ని మీకు తెలుసా?

by Admin
May 21, 2025

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!