Knee Pains : మనలో చాలా మంది కీళ్ల వాతం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎముకల మధ్య యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల కీళ్ల వాతం సమస్య తలెత్తుతుంది. కీళ్ల వాతం కారణంగా విపరీతమైన కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పుల కారణంగా చాలా మంది నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి సమయంలో ఈ నొప్పులు మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ నొప్పుల కారణంగా చాలా మంది సరిగ్గా నిద్రకూడా పోలేరు. కనుక ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఈ సమస్యను కనుక నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇటువంటి కీళ్ల వాతం సమస్యను ఒక చక్కటి చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించే చిట్కాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే ఈ చిట్కాను వాడడానికి ముందు రోజూ 5 నుండి 10 వాల్ నట్స్ నీటిలో నానబెట్టుకుని తినాలి. ఇలా రెండు నెలల పాటు తినడం వల్ల కీళ్ల వాతం సమస్య చక్కగా తగ్గుతుంది. అలాగే రోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తిని వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే నేరేడు చెట్టు బెరడు కీళ్ల వాతాన్ని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నేరేడు చెట్టు బెరడును పొడిగా చేయాలి. ఈ పొడిని నీటితో కలిపి ఉడికించి నొప్పులపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే 5 లేత జామ ఆకులను నీటితో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనికి నల్ల ఉప్పును కలిపి తినడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు పోతుంది.
దీని వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. అదే విధంగా మూడు టీ స్పూన్ల ఆవ నూనెలో 4 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా వేయించాలి. తరువాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను నొప్పులపై రాస్తూ మర్దనా చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి. అలాగే కీళ్ల వాతం సమస్యతో బాధపడే వారు రోజూ 20 నుండి 25 గ్రాముల ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎండు కొబ్బరిని తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే క్యారెట్ జ్యూస్ లో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా కీళ్ల వాతం సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.