Mud Pack For Joint Pains : ప్రస్తుత కాలంలో చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నడివయస్కుల్లో కూడా ఈ సమస్యను మనం గమనించవచ్చు. మారిన మన జీవన శైలే దీనికి ప్రధాన కారణం. పోషకాహార లోపం, శరీరంలో క్యాల్షియం లోపించడం, అధిక బరువు వంటి వాటిని ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్య తలెత్తగానే చాలా మంది పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల నొప్పి తగ్గనప్పటికి భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మోకాళ్ల నొప్పులను మనం సహజ సిద్దంగా కూడా తగ్గించుకోవచ్చు. మోకాళ్ల పై హాట్ మడ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది.
కండరాలకు విశ్రాంతి కలిగించడానికి, ఇన్ ప్లమేషన్ ను తగ్గించడానికి ఈ హాట్ మడ్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హాట్ మడ్ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం పొలాల దగ్గర ఉండే నల్ల మట్టిని తీసుకోవాలి. తరవాత దానిని ఉండలు లేకుండా మెత్తగా దంచి జల్లించుకోవాలి. తరువాత ఈ మట్టిలో నీళ్లు పోసి నానబెట్టాలి. నానిన ఈ నల్లమట్టిని గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద ఉంచాలి. తరువాత దీనిని 45 నుండి 50 డిగ్రీల వరకు మన చర్మం తట్టుకోగలిగేంత వేడి చేయాలి. తరువాత మోకాళ్ల ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి. దానిలో ముద్ద కర్పూరాన్ని వేసి కరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను మోకాళ్లపై రాసి పది నిమిషాల పాటు మర్దనా చేయాలి.
ఇలా నూనె రాసిన తరువాత వేడి చేసిన మట్టిని తీసుకుని మోకాళ్ల చుట్టూ ప్యాక్ లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై నుండి ఒక వస్త్రాన్ని ఉంచి కట్టుకట్టాలి. మట్టిలో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడతాయి. ఈ మట్టిని చల్లారే వరకు అలాగే ఉంచి తరువాత తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఈ మడ్ ప్యాక్ మోకాళ్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిని రోజుకు రెండు సార్లైనా ఉపయోగించవచ్చు. పెయిన్ కిల్లర్ లను వాడి అనారోగ్య సమస్యల బారిన పడడానికి బదులుగా ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల మోకాళ్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.