Over Weight Home Remedies : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఊబకాయం బారిన పడుతున్నారు. అధిక బరువు కారణంగా అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అధిక బరువు వల్ల రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కనుక చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే మనం వీలైనంత త్వరగా ఊబకాయం సమస్య నుండి బయట పడాలి. చాలా మంది బరువు తగ్గించుకోవడానికి రకరకాల మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా మనం బరువును తగ్గించుకోవచ్చు. బరువును తగ్గించే ఇంటి చిట్కాల ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి..అలాగే వీటిని ఎలా వాడాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు సమస్యతో బాధపడే వారు రోజూ నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తీసుకోవడం వల్ల చాలా సలుభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేనె, నిమ్మరసంలో బరువును తగ్గించే అనేక పోషకాలు ఉంటాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, అర చెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా తీసుకున్న తరువాత రోజూ వారి వ్యాయామాలను చేసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాము. ఒక టీ స్పూన్ జీలకర్రను కచ్చా పచ్చాగా దంచి నీటిలో వేసి నానబెట్టాలి.
తరువాత ఈ నీటిని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అదే విధంగా మనం ఆహారంగా పెరుగు రైతాను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు రైతాను తినడం వల్ల ఇతర ఆహారాలు తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే ఆకలి కూడా ఎక్కువగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ప్రతిరోజూ కూడా శరీరం మొత్తం కదిలేలా 15 నుండి 20 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.