Sonthi For Weakness : మనలో చాలా మందికి ఉదయం లేచిన తరువాత నీరసంగా ఉండడం, బద్దకంగా ఉండడం, ఉత్సాహంగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనినే మార్నింగ్ సిక్ నెస్ అని కూడా అంటారు. అలాంటి వారిలో పొట్టలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే నోటిని శుభ్రం చేసుకున్నప్పుడు పసర్లు రావడం, పుల్లటి త్రేన్పులు రావడం వంటి జరుగుతూ ఉంటాయి. దీని వల్ల వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేకపోతుంటారు. సహజ సిద్దంగా మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మార్నింగ్ సిక్ నెస్ సమస్య తగ్గాలంటే రాత్రి పూటే మనం ఔషధాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ సిక్ నెస్ ను తగ్గించడంలో మనకు శొంఠి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనకు మార్కెట్ లో శొంఠి విరివిరిగా లభిస్తుంది. శొంఠిని తీసుకుని ముక్కలుగా చేసి జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఇలా మిక్సీ పట్టుకున్న శొంఠిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఈ శొంఠిని 3 గ్రాముల మెతాదులో తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత దీనికి ఒక టీ స్పూన్ తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా సాయంత్రం పూట శొంఠి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఉదయం పూట నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో, పొట్టలో ఆహారం నిల్వ ఉండకుండా చేయడంలో, ఆకలి ఎక్కువ అయ్యేలా చేయడంలో శొంఠి మనకు ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి కనుక పుల్లటి త్రేన్పులు రావడం, పసర్లు రావడం, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వారు ముందుగా దంతాలను శుభ్రం చేసుకుని లీటర్ నుండి లీటర్నర గోరు వెచ్చని నీటిని తాగాలి. అలాగే ఈ నీటిలో అర చెక్క నిమ్మరసాన్ని కలుపుకుని కూడా తాగవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ చక్కగా తగ్గుతుంది. ఇలా నీటిని తాగడం వల్ల పొట్ట, ప్రేగులు చక్కగా శుభ్రపడడంతో పాటు నీరసం, బద్దకం తగ్గి ఉత్సాహంగా ఉంటుంది. ఈ విధంగా సాయంత్రం పూట శొంఠిని తీసుకుంటూ ఉదయం పూట నీటిని తాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ సమస్య నుండి చాలా సులభంగా బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.