Spices For Diabetes : డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో రోజు రోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగానే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ఈ సమస్య బారిన పడిన వారు ఖచ్చితమైన ఆహార నియమాలను కలిగి ఉండాలి. ప్రతిరోజూ మందులను వాడాలి. వ్యాయామం చేయాలి. షుగర్ వ్యాధి అదుపు తప్పితే అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక షుగర్ వ్యాధిని తప్పకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి శ్రమ లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతో మనం చాలా సులభంగా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే మసాలా దినుసులు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ఉండే మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. మెంతులు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మెంతుల్లో ఫైబర్ తో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగాలి. అలాగే మెంతులను కూడా తినాలి. అదే విధంగా మెంతి పొడిని మజ్జిగలో లేదా పెరుగులో వేసి కలిపి తీసుకోవాలి. ఇలా మెంతులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అలాగే నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధిని మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ ను నియంత్రించడంలో దోహదపడతాయి. ఈ మిరియాలను పొడిగా చేసి దీనికి సమానంగా పసుపును కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి కలిపి తాగాలి. భోజనానికి ఒక గంట ముందు ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మన ఇంట్లో మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇది బయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. దాల్చిన చెక్క, మెంతులు, పసుపును సమపాళ్లల్లో కలిపి నీటిలో కలిపి తాగాలి. అలాగే ఈ దాల్చిన చెక్కను నేరుగా లేదా పొడిగా చేసి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఈ విధంగా మసాలా దినుసులను వాడడం వల్ల మనం చాలా సులభంగా డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.