మనలో చాలా మందికి సహజంగానే అప్పుడప్పుడు కడుపులో నులి పురుగులు ఏర్పడి సమస్యగా మారుతుంటుంది. చిన్నారుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
* నారింజ పండు తొక్కలను తీసి ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిని గోరు వెచ్చని నీటితో కలిపి పరగడుపున 3 రోజుల పాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* చెరుకు రసంలో 25 గ్రాముల శనగలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే నులిపురుగులు నాశనం అవుతాయి.
* ముల్లంగి రసంలో కొంచెం ఉప్పు వేసి ఉదయం, సాయంత్రం 4 రోజుల పాటు తీసుకోవాలి. దీంతో నులి పురుగుల సమస్య ఉండదు.
* మజ్జిగలో జీలకర్ర, ఉప్పు, నిమ్మకాయ, కరివేపాకులు కలిపి వారం రోజుల పాటు రోజూ తీసుకోవాలి. దీంతో నులి పురుగులు చనిపోతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365