మానసిక ఒత్తిడి, ఆందోళనలో ఉన్నవారు జాజినూనెని వాడితే మంచి ఫలితం ఉంటుంది. జాజినూనె వాడుక వలన గుండె పని తీరును పెంచుతుంది. ఒంటి నొప్పులతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గిపోయాయి. బకెట్ నీళ్లలో కొద్దిగా జాజినూనెను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్రపడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు పొత్తి కడుపు మీద రాస్తే మంచిది. తలలో పేలు బాధిస్తుంటే.. కొబ్బరినూనెలో జాజి తైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు.
చెంచా పాల మీగడలో నాలుగు చుక్కలు చేర్చి మర్దనా చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. దీనికి బదులుగా ఆహారంలో ఎక్కువ మొత్తం పొటాషియం గల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పొగాకు ఉత్పత్తులు, పొగతాగడం, ఆల్కహాల్, సారాయి, మాదకద్రవ్యాలు వంటివి మోతాదు మించి సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తనాళాలు విశాలం అవడానికి విటమిన్ -బికి చెందిన నియాసిస్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన మాత్రలు వాడటానికి వైద్యుల సలహా తప్పనిసరి.
గోధుమ ఊక, వేరుశనగపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, కోడిగుడ్డు, చేపలలో బి – విటమిన్ ఎక్కువ. కప్పు నీళ్లలో ఆరుచుక్కల నీలగిరితైలం కలిపి పుక్కిలిస్తే నోటిపూత, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు బాధించవు. జ్వరంతో బాధపడేవారికి చల్లటి నీళ్లలో ఆరు నుంచి పది చుక్కల నీలగిరితైలం వేసి శరీరాన్ని శుభ్రపరిస్తే త్వరగా జ్వరం తగ్గుతుంది. జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పితో బాధపడుతున్నట్లైతే చేతిలో నాలుగు చుక్కలు నీలగిరి తైలం వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే ఆరు నుంచి పది చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి. ప్లూ జ్వరంతో బాధపడుతున్నవారు నీళ్లలో రెండు మూడు చుక్కలు కలిపి తాగితే మంచిది. కండరాల నొప్పి, నరాలు పట్టుకుపోయినప్పుడు కొబ్బరి నూనెలో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్య దూరమై హాయిగా ఉంటుంది.