నేటి రోజుల్లో ప్రతి దుకాణంలోను కూరలు దొరుకుతూనే వున్నాయి. అయితే ఇవి ఎంతవరకు సురక్షితం? వీటిలో మంచివి ఏవి. వాటి పోషకవిలువలు ఎలా తెలుసుకోవాలి, ఏ కూరలలో రసాయనాలు లేవు అనేది ప్రతి కొనుగొలుదారుకు సమస్యే. సేంద్రియ లేదా ఆర్గానిక్ కూరలు కొంటే ఖచ్చితంగా ఇవి పెస్టిసైడ్లు లేదా ఇన్సెక్టిసైడ్ల వంటివి కలిగి వుండవు. అయినప్పటికి, వీటిని ఇంటికి తీసుకు వెళ్ళి బాగా శుభ్రంచేయాలి.
వ్యవసాయ శాఖ సురక్షితమని తెలిపిన కూరలైనప్పటికి వాటిని మనం కూడా తాజాదనం, వాసన, రంగు మొదలైనవాటికి చెక్ చేయాలి. కూరగాయలపై పెస్టి సైడ్ చల్లకపోయినప్పటికి, వాటిని పండించే భూమి కూడా పెస్టిసైడ్ ల నుండి దూరంగా వుండాలి. అంటే సుమారు 3 లేదా 4 సంవత్సరాలు భూమిలో పెస్టిసైడ్ లు చల్లరాదు.
కూరలను వేడి నీటితో కడగండి, లేదా తరిగి వాటిని ఉడకపెట్టండి. క్రిములు నశిస్తాయి. కొన్నిటికి తొక్క కూడా తీయాలి. అయితే తొక్క అధికంగా తీస్తే పోషక విలువలు పోయే ప్రమాదం కూడా వుంది. కూరలను దుకాణాలలో వివిధ వ్యక్తులు కూడా చేతితో పట్టుకుంటారు కనుక కొన్న వాటిని తప్పక శుభ్రం చేయాలి. కూరగాయలు శుభ్ర పరచాలంటే వాటిని నీరు వినేగర్ కలిపిన నీటిలో నానపెట్టండి. తర్వాత మంచినీటితో కడిగితే, క్రిములు పూర్తిగా నశిస్తాయి. మరిగే నీటితో కూరగాయలను కడిగితో వాటిలోని పోషక విలువలు నశిస్తాయి.