ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటున్నారు. ఎంతో స్మార్ట్ గా ఉంటున్నారు. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కూడా తక్కువ ధరకు వచ్చేలా డిస్కౌంట్స్ వంటి వాటిని చూసి కొనుగోలు చేస్తున్నారు. అయినప్పటికీ చాలా చోట్ల షాపుల్లో అమ్మేవాళ్ళు MRP కంటే ఎక్కువ రేటుకి అమ్మడం వంటివి చేస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా షాప్ లో ఎవరైనా MRP కంటే ఎక్కువకి అమ్మితే ఏం చేయాలి..? వాటిని ఎలా స్టాప్ చేయొచ్చు..? ఎలా కంప్లైంట్ చేయొచ్చు అనే విషయాలను చూద్దాం.
MRP అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. అది భారతదేశంలో ఉన్న ప్రొడక్ట్స్ కి ఫిక్స్డ్ అయి ఉంటుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2006 లో దానిని కచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పారు. అయితే దాని కంటే ఎక్కువగా అమ్మడం అనేది చట్ట విరుద్ధం. కానీ చాలా చోట్ల ఇలా అమ్ముతున్నారు. అలా జరిగినట్లయితే నేషనల్ కన్జ్యూమర్ ఫోరం హెల్ప్ లైన్ నెంబర్ 1800-11-4000 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు.
ఇలా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అవుతుంది. ఈ లింక్ ఓపెన్ చేసి మీరు సులువుగా కంప్లైంట్ ఇవ్వచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి (ConsumerHelpline.gov.in.) సైన్ అప్ అయ్యి లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ప్రోడక్ట్ అలాగే షాప్ కీపర్ వివరాలతో కంప్లైంట్ చేయడానికి అవుతుంది. అలా మీరు కంప్లైంట్ చేసినట్లయితే వాళ్లపైన యాక్షన్ తీసుకుంటారు.