ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్ గురించి వివరించగలరా ? అన్ని వాహనాలలా కాకుండా పైకి బాణం గుర్తు ఉంటుంది. ఎందుకు ఇలా? బొమ్మలో గమనించండి. నంబరు గురించి నాకున్న పరిజ్ఞానం మీతో పంచుకుంటాను. బాణంగుర్తు బ్రాడ్ ఏరో బ్రిటిష్ ఆర్డినెన్స్ నుండి వాడుకలో ఉంది. భారతీయ సేనలో బ్రిటిష్ వారి అలవాట్లు, వ్యవహార శైలి, సంస్కృతి సాంప్రదాయాలు, etiquette, manners, customs and traditions ఇప్పటికి అనుసరిస్తున్నారు. నిజానికి బాణం గుర్తు సక్రియలో ఉన్న వాహనానికి సంకేతము.
మనము దీనిని Fit to Service, Fit to Use, Fit to Fight in War గా భాష్యం చెప్ప వచ్చు. ముందు రెండు నెంబర్లు Year of commissioning in the Indian Armed Forces తరువాత వాహన classification అంటే హెవీ వెహికిల్స్ టాంకులు లాంటివి A, లైట్ వెహికిల్స్ జీపు కార్ లాంటివి B, ఎర్త్ మూవర్స్ బుల్డోజర్ లాంటివి C, స్పెషల్ వెహికిల్స్ లాంటివి P తో సూచిస్తారు. ఆ పై ఆర్మీ సంబంధిత విభాగము నెంబర్ ఇస్తుంది.
ఆఖరి నెంబర్ సంబంధిత నెల మొదటి రెండువారాలు ఆఖరి రెండు వారాలను బట్టి నిర్ధారింపబడుతుంది. సంవత్సరానికి 12 నెలలు. ఇంగ్లీషు అక్షరాలు 26. భారతీయ సేన లో I, O ఇంగ్లీషు అక్షరాలు అంకెలతో వాడరు, ఎందుకంటే డికోడింగ్ చేసేటప్పుడు తప్పు జరిగే అవకాశముంటుంది. నేను చెప్పినట్లు ముందు రెండు నంబర్లు Vehicle commissioning years అయితే ఆఖరి ఇంగ్లీషు అక్షరం నెలలో మొదటి రెండు వారాల లేదా ఆఖరి రెండు వారాలను చెబుతుంది. ఉదాహరణకు పై కారు తీసుకుంటే 2016 నవంబరు first fortnight commissioned B Type light Vehicle అని W అక్షరం నవంబర్ first Fortnight అని అర్థమవుతుంది.