inspiration

బ్రిటిష్ వారిని ఎదిరించి నిల‌బ‌డ్డ సాహ‌సి ఆమె.. ఏం చేసిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయులకు&comma; కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు అని&period;&period; చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటిష్ క్లబ్ ముందు బోర్డ్ కట్టారు&period; ఎంత దుర్మార్గం&period;&period; ఎంత అహంకారం&period; బ్రిటిష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి&period;&period; ఓ అమ్మాయి మనసు రగిలింది&period; ఆమె గుండెలో ఆగ్రహం మండింది&period; ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి&period; ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి&period;&period; తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొంది&period; ఆమె పేరు ప్రీతిలత&period; కలకత్తా యూనివర్సిటీలో బి&period;ఏ&period; ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వరాజ్యవీరుడు సూర్యసేన్ సహకారంతో&period;&period;1932సెప్టెంబర్ 24 రాత్రి 10&colon;45నిముషాలకు&period;&period; బ్రిటిష్ క్లబ్ పైన దాడి చేసింది&period; ఒక్క దెబ్బకే బోర్డ్ బద్దలయ్యింది&period; క్లబ్ లోకి ధైర్యంగా అడుగుపెట్టి &period;&period; కాల్చడం మొదలు పెట్టారు ప్రీతిలత బృందం&period; యువ వీరుల్ని చూసి భయంతో గజగజ లాడారు బ్రిటిష్ అధికారులు&period; అప్పటికే చాలా మంది గాయపడ్డారు&period; ఇంతలో&period;&period; ఒక మూలనుండి ప్రీతిలతని గురి చూసి కాల్చాడు ఓ తెల్లవాడు&period; బులెట్&period;&period; ప్రీతిలత భుజంలోకి దూసుకు పోయింది&period; రక్తం ధార కట్టింది&period; ఆ చేతిని అలాగే నొక్కి పెట్టి&period;&period; ప్రీతిలత ముందుకు సాగింది&period; ఆమె ధైర్యానికి బ్రిటీష్ అధికారులు వణికిపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91716 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;preethi-latha&period;jpg" alt&equals;"do you know this about preethi latha " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రమంగా బులెట్ గాయంనుండి రక్తస్రావం ఎక్కువయ్యింది&period; ప్రాణాలతో ఆంగ్లేయులకు దొరకడం ప్రీతిలతకు ఇష్టం లేదు&period; అందుకే&period;&period; తనతో తెచ్చుకొన్న విషం మింగి&period;&period; భరతమాతకూ జై అంటూ&period;&period; ప్రాణాలు విడిచింది&period; ప్రీతిలతకు అప్పటికి కేవలం ఇరవై ఒక్కేళ్ల వయసు మాత్రమే&period; ఆ తర్వాత భారతీయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే అటువంటి బోర్డులు మరెక్కడా పెట్టే ధైర్యం చేయలేకపోయారు తెల్లవాళ్ళు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts