Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

న‌గ‌రానికి దూరంగా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసిన వ్య‌క్తి.. అందులో వాస్తు మార్పులు చేయించాలని చూస్తే..?

Admin by Admin
May 23, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపార వేత్త, హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు. వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడే. ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగిన మార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు. సత్యనారాయణ వాస్తును పరిశీలించే శాస్త్రిని తీసుకొని కారులో ఇద్దరూ బయలుదేరారు. కొంత ప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో సత్యనారాయణ కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి చిరునవ్వుతో ..

మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు. దానికి సత్యనారాయణ నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయి ఉండొచ్చు, అందుకే తొందరలో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు. అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది. అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో సత్యనారాయణ కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన సత్యనారాయణ అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు. అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.

man build farm house and tried to set vastu for it

ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రి వంతైంది. ఆయన సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడను మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు. స‌త్యనారాయణ నవ్వుతూ.. పిల్లలెప్పుడూ అంతేకదండి! ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు. కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి, అది చూసిన సత్యనారాయణ శాస్త్రిని ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం.. అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కోస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.

ఎందుకండీ అనవసరంగా అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు. శాస్త్రి కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు. ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు ! ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ వంతైంది. ఏం?ఎందుకండి? ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు. ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటామో, ఆ ఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మరిపోతాడు. నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

Tags: farm housevastu
Previous Post

ఉప‌వాసం చేసినా కూడా 194 షుగ‌ర్ వ‌చ్చింది.. ఇలా ఎందుకు జ‌రుగుతుంది..?

Next Post

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

Related Posts

Off Beat

విమానం రెక్క‌లు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?

July 20, 2025
ఆధ్యాత్మికం

మొలతాడు ఎందుకు కడతారో తెలుసా..?దీని వెనుక సైన్స్ ఏంటి అంటే.??

July 20, 2025
mythology

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

July 20, 2025
హెల్త్ టిప్స్

మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

July 20, 2025
వైద్య విజ్ఞానం

ఈ అల‌వాట్లు మీకు ఉన్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. మీ మాన‌సిక ఆరోగ్యం పాడవుతుంది..!

July 20, 2025
lifestyle

పీడ‌క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి..!

July 20, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.