భూ భాగంలో చాలా పెద్దది రష్యా.. టెక్నాలజీ పరంగానూ గొప్పదే అయితే సోమరితనం ఉన్నందున కొన్ని సందర్భాలలో వెనుకబడి పోతుంది. చైనా కూడా మనకంటే పెద్దది…టెక్నాలజీలో అభివృద్ధిలో కూడా గొప్పదే.. కానీ కొన్ని సందర్భాలలో గ్యారంటీ లేని పనితనం చూపిస్తుంది. ఇక అమెరికాను నియంత్రణలో ఉంచాలంటే చాలా కాలం పట్టవచ్చు…అందుకోసం ఎక్కువ దేశాలు ప్రణాళికలు సిద్దం చేయవలసి ఉంటుంది. ఇక దేశ విదేశాల రాజకీయాలు ఎప్పుడు ఎలా దారి మళ్ళుతాయో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు అమెరికాను చూడండి. ముస్లిం దేశమైన పాకిస్థాన్ లో అణు స్థావరాలను ఏర్పాటు చేసింది, ఇరాక్ తో యుద్ధ సమయంలో ఆ దేశ భూ భాగాన్ని వినియోగించుకుంది. అదే ఇప్పుడు ఇరాన్ కి వ్యతిరేకంగా పనిచేస్తోంది.. మరి అది కూడా ముస్లిం దేశమే….పాకిస్థాన్ అణు శక్తిని కలిగి ఉండొచ్చు, ఇరాన్ ఉండకూడదు.. అలాగే మన దేశం మీద కూడా ఆంక్షలు విధించే ప్రయత్నం చేసింది..
ఒకప్పుడు ఆగిపోయినా.. శాటిలైట్ కి ఇమేజ్ లు కనపడకుండా ఉండే కొత్త టెక్నాలజీని ఉపయోగించి వాజ్ పాయి హయాంలో అణు పరీక్షలు జరిపింది, ఆ తదనంతరం మీడియా సమావేశంలో వాజ్ పాయి చెప్పేవరకూ బయట ఎవరికీ తెలియని పరిస్థితి. అలా అమెరికా ఎప్పుడూ చెడు ఆలోచనలతో ఉంటూ ఎవరూ తనకంటే గొప్పగా అభివృద్ధి చెందకూడదు, ఆయుధాలు కలిగి ఉండకూడదని.. తన వ్యూహాత్మక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళుతుంది. కావాలంటే దేశ దేశాలనే తగులబెడుతుంది. తన వేలితో తన కళ్ళు పొడుచుకునే రోజులు తప్పక వస్తాయి. ఈ గుంటనక్క వ్యవహారాన్ని అదుపు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నా కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ వ్యవహారంపై మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినా. ప్రపంచంలో ఏ దేశమూ ఉండదు. కారణం రష్యా వద్ద ఉన్న డెడ్ హ్యాండ్ టెక్నాలజీ… వారి దేశంలో ఏ ఒక మానవుడూ ప్రాణాలతో లేకపోయినా రష్యా ప్రపంచాన్ని గెలుస్తుంది… అందుకే దానికి డెడ్ హ్యాండ్ అని పేరు పెట్టారు.. చచ్చిన చేయి చివరిగా యుద్ధం చేస్తుంది..
కాకపోతే 5 వేలకు పైగా ఉన్న అణు రాకెట్లతో.. దేశం అన్ని మూలలనుంచీ అవి బయలు దేరి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాయి. వారు కాస్త సోమరులు ఎందుకంటే.. ఇప్పుడు ఏదైనా జబ్బుకి మందులు లేవంటే భయంతో ఉండటం, నివారణా చర్యలు తీసుకుంటూ బతుకుతాము.. అన్ని జబ్బులకీ మందులున్నాయి మేలు చేసుకోవచ్చని తెలిస్తే, అలాంటి జబ్బు వచ్చినా మందులున్నాయిలే అని కొంతైనా అలసత్వం చూపుతాము. అట్లాగే వారు కూడా.. మాకేమి భయం అనేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి కాస్త అలసత్వం.. అందుకే ఉక్రెయిన్ డ్రోన్లతో విధ్వంసం సృష్టించింది… ఇలాంటి అనుభవాలతో పాఠాలు నేర్చుకుని ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండగలిగితే రష్యా ను చూసి మిగతా అన్ని దేశాలూ భయపడక తప్పదు. నాకు తెలిసి రష్యా.. దానికి చేయూతనిస్తూ చైనా ఉంటే ఉండొచ్చు.. BRICS.. దేశాలకి సాధ్యం అనుకుంటున్నా.