Chanakya Niti : చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఎదురవ్వవు. ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది చెప్పారు. ఈ లక్షణాలున్న వ్యక్తి ఎప్పుడూ కూడా పేదరికంలోనే జీవిస్తాడని చాణక్య చెప్పారు. ఎప్పుడూ కూడా పేదరికంలోనే బాధపడాలట. మరి పేదరికం నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి..?, ఎటువంటి లక్షణాలు ఉండకూడదు.. అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం.
కోపాన్ని ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలి. కోపం లేని స్త్రీని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. కోపం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో ఐక్యతగా కలిసి ఉండాలనే భావన ఉండాలి. కుటుంబ సభ్యులతో కాసేపు సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఇంట్లో మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఇలా ఉంటే కుటుంబ సంబంధాలను బలపరచుకోవచ్చు.
అదే విధంగా పేదరికానికి ముఖ్యమైన కారణం ఆర్థిక వనరులని సరిగ్గా నిర్వహించ లేకపోవడం. అలా చేస్తే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఎప్పుడూ కూడా ప్రతి మనిషి తెలివిగా ఖర్చు చేయాలి. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి తప్ప డబ్బులు ఉన్నప్పుడు విపరీతంగా ఖర్చు చేయకూడదు. ఇలా ఆర్థిక ఇబ్బందులు మొదలై చివరికి పేదరికం సంభవిస్తుంది. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోవాలి.
ఒక వ్యక్తి జీవితంలో విద్యా నైపుణ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగం ఉండదు. పేదరికంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. వ్యసనాలు, దుర్గుణాలు కలిగిన వ్యక్తి కూడా జీవితంలో పైకి రాలేడు. ఎప్పుడూ దరిద్రంలో ఉండేట్టు ఇవి చేస్తాయి. కాబట్టి వ్యసనాలు, దుర్గుణాలలో మునిగిపోవడం మంచిది కాదు. ఎప్పుడూ కూడా లైఫ్ లో ఫోకస్ పెట్టడం, అనుకున్న దానికోసం కష్టపడడం చాలా అవసరం. ఇలా మీరు కనుక వీటికి దూరంగా ఉన్నట్లయితే జీవితం బాగుంటుంది. జీవితంలో ఎదగగలరు. సంతోషంగా ఉండొచ్చు.