నేను రాత్రి 10 pm కి పడుకున్నా. ఉదయం 6 amకి లేచాను. 10pm to 6am మధ్య ఎం జరిగిందో నాకు తెలియదు. అంటే నా మైండ్ స్విచ్ ఆఫ్ అయిది. అంటే ఒక మనిషి చనిపోయినపుడు కూడా ఇలాగే ఉంటుందా… పర్మినెంట్ గా..? అంటే..? గాఢ నిద్ర లో వున్న మనిషి సగం చనిపోయినట్టు లెక్క. మెదడు పనితీరు ఎన్నటికీ అంతుపట్టని ఓ మిస్టరీ. దీర్ఘ నిద్ర అంటే చనిపోయినట్టు లెక్క.
మీరు 8 గంటలు నిద్ర పోయారు. మధ్యలో కనీసం ఒక్కసారైనా లేవలేదు. మీది గాఢ నిద్ర. అదృష్టం అంటే ఇదే మరి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రధానంగా చెవులు విశ్రాంతి తీసుకుంటూ వుంటాయి. చాలా పెద్ద శబ్దాలకు మాత్రమే స్పందిస్తాయి. అలాగే మన శరీరంలోని ఇతర అవయవాలు, ఇతర జ్ఞానేంద్రియాలు కూడా పాక్షిక విశ్రాంతిలో వుంటాయి. నిద్ర పోవడం, మెలకువ ఇవన్నీ జీవలయల ప్రకారం మన దేహంలోని జీవ గడియారం నియంత్రిస్తుంది.
నిద్ర అనేది నాడీ వ్యవస్థలో జరుగుతున్న రసాయన ప్రక్రియ. నిద్ర పోయేది మెదడు. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు విశ్రాంతి తీసుకుంటోంది. నిద్రపోతున్నప్పుడు మెదడు మస్తిష్క ద్రవంలో వున్న మలినాలు, విష పదార్థాలు బయటకు విసర్జింపబడతాయి. 16 గంటలు చురుకుగా పని చేయాలంటే 8 గంటలు నిద్రపోవాలి. మనిషి చనిపోయినప్పుడు మెదడులోని నాడుల్లో జరుగుతున్న విద్యుత్ రసాయన చర్యలు ఆగిపోతాయి. ఇది శాశ్వత నిద్ర. ఇక మెలకువ రాదు.