Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ ఇంట్లో పిల్ల‌లు ఉండి పెంపుడు జంతువులు కూడా ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..

Admin by Admin
May 22, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇప్పుడు ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు ఉండటం కామన్‌గా మారిపోయింది. ఒకటి కంటే ఎక్కువ జంతువులను పెంచుకోవటం పరిపాటిగా మారింది. కొందరు పెట్స్‌పై ఇష్టంతో పెంచుతుంటే.. మరికొందరు స్టేటస్‌ సింబల్‌గా పెంచుతారు. ఏది ఏమైనా ఇంట్లో పిల్లల్లా సందడి చేస్తూ, ఎంతో ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన ప్రేమను అందిస్తాయి పెంపుడు జంతువులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇంట్లోకి మరొక బుల్లి పాపాయో, బుల్లి బుజ్జాయో వచ్చినప్పుడు, పెట్స్‌ను దూరం పెట్టాలా.. అని ఆలోచిస్తున్నారా.. లేదా బ్లూక్రాస్‌ వాళ్లకో, పెంపుడు జంతువు సంరక్షణ వారికో ఇచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారా? సంవత్సరాలు తరబడి పెంచిన ప్రాణులను దూరంగా పెట్టడం మీ వల్ల కావటం లేదా..? అయితే ఈ టిప్స్‌ మాటించండి.. మీ బుజ్జాయికి కూడా పెంపుడు జంతువులను అలవాటు చేయండి..!

మీరు పెంచే కుక్క, లేదా పిల్లికో.. మీతో అనుబంధం ఏర్పడే ఉంటుంది. మీరు చెప్పే మాటలను అవి వింటూనే ఉంటాయి. అటువంటప్పుడు.. ఇంట్లోకి వచ్చిన మీ బేబీని వాటికి చూపించండి.. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనీ వాటికి అర్థం అయ్యేటట్లు చెప్పండి. అలాగే.. బేబీ కోసం కొన్ని రోజులు బెడ్‌ రూమ్‌కు దూరంగా ఉండమని సముదాయించండి. మీతో మంచి అనుబంధం ఉండి ఉంటే.. కచ్చితంగా మీ మాట వింటాయి. రోజుల వ్యవధి ఉన్న బేబీను పెంపుడు జంతువులకు కొంచెం దూరంగా ఉంచటం మంచిది. ఈ సమయంలోనే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.. కొన్నికొన్ని సార్లు పెంపుడు జంతువుల గాలి వల్ల.. ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నెలలు వచ్చే వరకు.. పెంపుడు జంతువులను దూరంగానే ఉండనివ్వండి. ఇందుకోసం ముందు నుంచే వాటికి మీరు చెప్తూ ఉండటం చేయాలి.

if you have kids and pets in your home follow these tips

పిల్లలకు మూడు నెలలు దాటిన నుంచి.. క్రమంగా తన పరిసరాలను పరిశీలించటం మెుదలుపెడతారు. తన చుట్టూ ఏం జరుగుతుందో అని గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని అనుకరించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచే పెంపుడు జంతువుల గురించి మీ పిల్లలకు చెప్తూ ఉండండి. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ వంటి గ్యాడ్జెట్లు అలవాటు చేయకుండా.. పిల్లల పక్కన పెంపుడు జంతువులను ఉంచి.. పిల్లలకు అలవాటు చేయండి. మీతో పాటే.. మీ పెంపుడు జంతువులకు కూడా, బెడ్‌రూమ్‌లో పక్కను ఏర్పాటు చేయండి.. దీని వల్ల.. అవి కూడా మనలాగే అన్న భావన పిల్లలల్లో నాటుకుపోతుంది.

చిన్నప్పటి నుంచే పిల్లలు పెంపుడు జంతువులకు బాగా అలవాటు పడితే.. వారు అస్సలు వాటిని జంతువులుగా చూడలేరు. మనలో ఒకరిలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పెంపుడు జంతువులను తాకేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుక్క, పిల్లి వంటివి వాటి తోకలను తాకడాన్ని అస్సలు ఇష్టపడవు. గడ్డం కింద చెక్కిల గింతలు పెడితో పరవశించిపోతాయి. ఈ తేడాలను పిల్లలకు వివరించండి. మనలాగే వాటికి కూడా ఫీలింగ్స్‌ ఉంటాయనీ, నొప్పి, బాధ, సంతోషం కలుగుతాయని పిల్లలకు వివరించండి. పెంపుడు జంతువులతో ఆడుకోనివ్వండి. దీనివల్ల పిల్లలు చాలా యాక్టివ్‌గా తయారవుతారు. చలాకీగా జంతువులతో పాటు తిరుగుతుండటం వల్ల, ఆహారాన్ని సైతం తగిన మోతాదులో తింటారు.

Tags: kidspets
Previous Post

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దానిలో ఉండే దశలు ఏమిటి ? ఈ సమస్యను తగ్గించుకునే మార్గాలు ఏమిటి ?

Next Post

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

Related Posts

vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

May 28, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

May 28, 2025
ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

May 28, 2025
lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

May 28, 2025
వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

May 28, 2025
వినోదం

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

May 28, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!