మనదేశంలో ఉన్న సనాతన సంప్రదాయాలకు చాలా మంది విలువ ఇస్తారు. ముఖ్యంగా కొన్ని శకునాలు బాగా విశ్వసిస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది పిల్లి ఎదురురావడం. దానిని అశుభంగా పరిగణిస్తారు. వ్యక్తులు బయటకి వెళ్తున్న మార్గంలో పిల్లి ఎదురైతే కాసేపు ఆగి మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. పిల్లి కనిపించడం నిజంగా దురదృష్టకరం అని చాలా మంది భావిస్తారు. అసలు పిల్లి ఎదురు రావడం అశుభమేనా అంటే కాదంటున్నారు పండితులు. పిల్లి ఎలా వస్తే మంచిది, ఎలా వస్తే మంచిది కాదో ఇప్పుడు మనం చూద్దాం..
ఇంతకు ముందు రోజుల్లో ఎద్దుల బండ్లు ఉండేవి.. అయితే ఆ సమయంలో పిల్లి ఎదురైతే ఆవులు చలించిపోయేవంట. ఆవులను శాంతపరిచేందుకు డ్రైవర్ కొద్దిసేపు వాటిని ఆపాల్సి వచ్చేది. ఆ తర్వాత అది ఆచారంలా తరువాత మూఢనమ్మకంగా మారింది. అప్పటి నుండి ఏదైనా బండి ముందు నల్ల పిల్లి వెళితే కారును ఆపడం ఆచారంగా మారింది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు. రాహువు ప్రభావంతో జీవితంలో ప్రమాదాలు సంభవించవచ్చు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, పిల్లి రాహువు వాహనం. అందుకే పిల్లి రోడ్డు దాటితే అశుభం అంటారు. పిల్లి దారి దాటుతోంది కాబట్టి రాహువు ప్రభావం ఉంటుంది అని అంటారు. భారతీయ సంస్కృతిలో చాలా మంది పిల్లి ఎదురు రావడం మన దురదృష్టకరమని భావించినప్పటికీ, ఈ నమ్మకానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకం మాత్రమే. వాస్తవానికి, పిల్లి మీకు ఎదురు రావడం వలన ఎలాంటి చెడు జరగదు.
సాధారణంగా పిల్లిని చెడుగా భావించినప్పటికీ, అది మీకు ఎదురొచ్చినప్పుడు శుభప్రదంగా కనిపించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. పిల్లి ఒకరి ఇంటి ముందు నడిస్తే, అది అదృష్టంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అది ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. పిల్లి వెనకకి చూసుకుంటూ వెళితే అది ఒక రక్షిత సంజ్ఞగా పరిగణించబడుతుంది, దురదృష్టం నుండి వ్యక్తిని కాపాడుతుంది.
పిల్లి ఎవరికైనా నేరుగా ఎదురుగా వెళ్లి చూస్తే అదృష్టాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు. అది ఆశీర్వాదంగా కూడా అనుకుంటారు. ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని మూఢనమ్మకం కొన్ని పరిస్థితులలో, ఇది శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది. . పిల్లి శకునంలా మారడానికి వెనుక ఒక కథ దాగి ఉంది. పూర్వకాలంలో పాలను ఉట్టిమీద దాచే వారు. బయటకు వెళ్లేటప్పుడు పిల్లి కనిపిస్తే మరలా ఇంట్లోకి వచ్చి పాలను జాగ్రత్త చేసి పిల్లి వెళ్లిన తరువాత వెళ్లే వారు. ఇది కాస్తా పిల్లి శకునంలా మారిందని పెద్దలు అంటారు… కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా ఈ పిల్లి శకునాన్ని విశ్వసిస్తారు.