ఒకప్పుడు క్యాసెట్లు… ఆ తరువాత సీడీలు, డీవీడీలు… ఇప్పుడవి కూడా అక్కర్లేదు. ఏకంగా స్మార్ట్‌ఫోన్లే వచ్చేశాయి. దీంతో చాలా మంది పోర్న్ (నీలి) చిత్రాలను చూస్తున్నారు. ఇటీవలి కాలంలో మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు మరీ తక్కువయ్యాయి కదా. దీనికి తోడు ఎక్కడ పడితే అక్కడ వైఫై కూడా దొరుకుతుంది. ఇదే కాదు, ఇంట్లో కూడా చాలా మందికి ఇంటర్నెట్ ఉంటోంది. దీంతో ఆ చిత్రాలను చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఏమో గానీ కెనడాలో అయితే ప్రతి ఒక్కరు ఆ చిత్రాలను చూస్తున్నారట. ముఖ్యంగా అక్కడి మగవాళ్లందరూ అలాంటి చిత్రాలను ఎక్కువగా చూస్తున్నారని ఓ సర్వేలో తెలిసింది.
కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ ఈ మధ్యే అక్కడ ఓ సర్వే చేసింది. అక్కడి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ సర్వే చేపట్టింది. ఇందుకోసం అనేక మందిని వారి అలవాట్లు, పద్ధతులు, నడవడిక వంటి ఎన్నో అంశాలను అడిగి తెలుసుకున్నారు సర్వే బృందం. ఈ క్రమంలో వచ్చిన సమాచారాన్ని విశ్లేషించగా వారికి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కెనడాలో చాలా మంది పోర్న్ వీడియోలను చూస్తున్నారట. ముఖ్యంగా ప్రతి మగాడికీ ఆ చిత్రాలను చూసే అలవాటు ఉందంట. అక్కడి వంద శాతం మగాళ్లు కచ్చితంగా పోర్న్ వీడియోలు చూస్తున్నారట. వారంలో కనీసం 3 సార్లయినా సగటున 40 నిమిషాల పాటు అలాంటి చిత్రాలను చూసేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారట.
మరీ ముఖ్యంగా కెనడాలో సగటున పదేళ్ల వయస్సు నుంచే అబ్బాయిలు పోర్న్ వీడియోలను చూస్తున్నారట. వీరితోపాటు కాలేజీలకు వెళ్లే యువకులు కూడా ఆ చిత్రాలను ఎక్కువ చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ వివరాలే కాకుండా మరో ఆసక్తికరమైన విషయం కూడా తెలిసింది. అదేమిటంటే… కాలేజీ యువకుల్లో గర్ల్‌ఫ్రెండ్ ఉన్న యువకులు అలాంటి చిత్రాలను చూడడం లేదట. వారు చాలా చాలా తక్కువగా ఆ చిత్రాలను చూస్తారట. కనీసం వారానికి ఒకసారి కూడా చూడరట. చూసినా 15-20 నిమిషాలకు మించి చూడరట. ఇక గర్ల్‌ఫ్రెండ్ లేకుండా సింగిల్‌గా ఉన్న యువకులు పోర్న్ చిత్రాలను బాగా చూస్తారట. ఇదే విషయాన్ని సదరు యూనివర్సిటీ సర్వే బృందం వెల్లడించింది. దీంతో ఇప్పుడీ విషయం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.