మానవుని కళ్లు సృష్టిలో ఉన్న ఎన్నో వేల కోట్ల రంగులను గుర్తించగలవు. అంతటి శక్తి వాటికి ఉంది. అన్ని వేల కోట్ల రంగులను కెమెరాలు కూడా చిత్రాల రూపంలో బంధించగలవు. అయితే నిజానికి ప్రాథమిక రంగులు మూడే. అవి ఎరుపు, ఆకుపచ్చ, నీలం. వీటిని పలు శాతాల్లో కలిపితేనే అన్ని రంగులూ ఏర్పడతాయి. ఈ క్రమంలోనే మనలో చాలా మందికి ఒక్కో రంగు అంటే అమితంగా ఇష్టం ఉంటుంది. అందుకే నిర్దిష్ట రంగులతో చేసిన వస్తువులనే చాలా మంది వాడుతారు. అయితే అలా వారు ఇష్టపడే రంగులను బట్టి వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చు తెలుసా..? అవును, ఎవరైనా వారు ఇష్టపడే రంగును బట్టి వారు ఎలాంటి వారో, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. మరి ఏయే రంగుల వల్ల మనకు వ్యక్తుల మనస్తత్వాలు తెలుస్తాయంటే… ఎరుపు… వీరు చాలా పట్టుదల కలిగి ఉంటారు. ధైర్యవంతులు అయి ఉంటారు. ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు. మనస్సులో ఏది ఉన్నా ఇట్టే బయటకు చెబుతారు తప్ప దాచుకోరు. ఎంతటి విషయాన్నయినా ఎవరితోనైనా ముఖంపైనే చెప్పగలిగే సమర్థత కలిగి ఉంటారు. ఏ పనిచేసినా 100 శాతం కష్టపడతారు. అదే స్థాయిలో సంతృప్తిని ఆశిస్తారు.
ఆరెంజ్… వీరు సహనశీలురు అని చెప్పవచ్చు. ఏ విషయం పట్లనైనా ఆచి తూచి స్పందిస్తారు. సహనంతో ఉంటారు. అందరితోనూ స్నేహ పూర్వకంగా మెలుగుతారు. సమాజంలో ఉన్న అందరితో కలుపుగోలుగా ఉండాలని చూస్తారు. ఏ సంఘంలోనైనా తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. పసుపు… పసుపు రంగును ఎక్కువగా ఇష్టపడే వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. హాస్యతను ప్రదర్శిస్తారు. ఎప్పుడూ ఒకే తరహా ఆలోచనలు కాక, భిన్నమైన ఆలోచనలు చేస్తారు. అయితే జీవితాన్ని మాత్రం సీరియస్‌గానే తీసుకుంటారు. ఒక ఆర్డర్‌లో అన్నీ జరగాలని కోరుకుంటారు. ఆకుపచ్చ… ఈ రంగును ఇష్టపడే వారు జాలి, దయ, కరుణ గుణాలను కలిగి ఉంటారు. ఇతరులకు ఎప్పుడూ సహాయం చేయాలని చూస్తారు. అందరినీ ప్రేమిస్తారు. అందరికీ సురక్షితమైన జీవితం కావాలని ఆశిస్తారు.
నీలం… ఈ రంగును ఇష్టపడే వారు ఇతరుల పట్ల అత్యంత నమ్మకస్తులుగా ఉంటారు. వీరికి మోసం చేయడం రాదు. చేయలేరు. అన్ని విషయాల్లోనూ అందరి పట్ల నమ్మకంగా ఉంటారు. ఇతరులకు రక్షణ కల్పించడంలో ముందుంటారు. అంత సులభంగా, వృథాగా దేన్నీ ఖర్చు చేయరు. ముదురు నీలం… వీరు నీతి, నిజాయితీలను కలిగి ఉంటారు. స్వార్థం అంటే తెలియదు. ఇతరులను చాలా బాగా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఊదా (వంకాయ) రంగు… వీరు చాలా మృదువైన స్వభావం కలిగి ఉంటారు. చిన్న మాట అన్నా తట్టుకోలేరు. భావోద్వేగాలకు లోనవుతారు. ఆప్యాయంగా ఉంటారు. ప్రేమించిన వారు దూరమైతే తట్టుకోలేరు. ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు.
పింక్… ఈ రంగును ఇష్టపడేవారు ఇతరులను బాగా ప్రేమిస్తారు. మృదు స్వభావులు అయి ఉంటారు. ఇతరుల అవసరాలను సరిగ్గా గుర్తించగలుగుతారు. ఒకసారి దూరమై మళ్లీ దగ్గరైనా ఇతరులను ప్రేమిస్తారు తప్ప ద్వేషించరు. మెజెంటా (Magenta)… ఈ రంగు అంటే ఇష్టపడేవారు ఎక్కువ ఊహా శక్తిని కలిగి ఉంటారు. వీరు సృజనశీలురుగా ఉంటారు. కొత్త ఆవిష్కరణలను సృష్టించగలరు. ప్రతిభా పాటవాలు ఎక్కువ. తమ చుట్టూ ఉన్నవారిని, ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు అన్ని భావాల పట్ల సరైన నియంత్రణ కలిగి ఉంటారు. టర్కాయిస్ (Turquoise)… ఈ రంగును ఇష్టపడే వారు స్నేహ పూర్వక స్వభావం కలిగి ఉంటారు. ఎంతటి ఉన్నత స్థానాల్లో వీరు ఉన్నప్పటికీ ఇతరులను సులభంగా కలవగలరు. సామాన్యులుగా ఉంటారు. వీరు తాము అనుకున్న లక్ష్యాలు ఎంత కష్టమైనప్పటికీ, ఇతరులు హేళన చేస్తారని అనుకున్నప్పటికీ వాటిని పైకి చెప్పేస్తారు.
గ్రే (Grey)… ఈ రంగును ఇష్టపడే వారికి జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. అన్ని విషయాలను అంత సీరియస్‌గా తీసుకోరు. తటస్థ స్వభావం కలిగి ఉంటారు. అంతగా స్పందించరు. కానీ వ్యక్తిగతంగా చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటారు. ఇతరులకు మర్యాద ఎక్కువగా ఇస్తారు. తెలుపు… వీరు ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు. అన్ని విషయాల పట్ల పాజిటివ్ ధోరణితో ఉంటారు. నెగెటివ్ ఆలోచనలు ఉండవు. చేసే ఏ పనిలో అయినా శ్రద్ధ పెడతారు. పాజిటివ్‌గా రిజల్ట్ ఆశిస్తారు. లైఫ్‌ను చాలా సింపుల్‌గా గడుపుతారు. ఆడంబరాలకు పోరు. నలుపు… ఈ రంగు ఇష్టపడేవారు పవర్‌ను కోరుకుంటారు. అధికారంలో ఉండడం, గౌరవ, మర్యాదలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. దృఢమైన విల్ పవర్ కలిగి ఉంటారు. చేసే పని పట్ల అంకిత భావం కలిగి ఉంటారు. ఉన్నత స్థానాల్లో పదవులను అధిరోహించడమే వీరి జీవిత ఆశయం.
బ్రౌన్… వీరు నీతి, నిజాయితీలను కలిగి ఉంటారు. అనుకుంటే ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా కిందకి దిగి రాగలరు. వీరు కూడా సింపుల్ లైఫ్‌ను కోరుకుంటారు. అయితే లైఫ్ పట్ల వీరికి భద్రతా భావం ఎక్కువ. సురక్షితంగా జీవించాలని కోరుకుంటారు. సిల్వర్… ఈ రంగు అంటే ఇష్టం ఉండే వారు ఎక్కువగా ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. సహజ సిద్ధమైన స్వభావాలను కలిగి ఉంటారు. ప్రకృతితో అనుబంధం ఎక్కువ. ఏ అంశం పట్ల అయినా చాలా తెలివిగా వ్యాఖ్యలు చేస్తారు. గోల్డ్… ఈ రంగు అంటే ఇష్టం ఉండే వారు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కోరుకుంటారు. తమ చరిష్మాతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. ఎప్పుడూ జ్ఞానార్జన కోసం తపిస్తుంటారు.